శుద్ధమైన తాగునీటి పై శ్రద్ధ ఏదీ..?

Published: Tuesday March 15, 2022
త్రాగు నీరందించని మిషన్ భగీరథ
అలంకార ప్రాయంగా పైపులైన్ లు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అదికారులు.
జన్నారం రూరల్, మార్చి14, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో మిషన్ భగీరథ పథకం పూర్తిగా విఫలమైంది. ఇంటింటికీ శుద్ధ జలాలను అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్‌ భగీరథ’ పథకాన్ని తీసుకువచ్చింది. అన్ని ఆవాసాలకు శుద్ధమైన తాగునీరు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.. అయితే ఇక్కడి అధికారుల తీరుతో పథకం అభాసుపాలవుతోంది. లక్షల రూపాయల కర్చు చేసినా మండల ప్రజలకు త్రాగు నీరు అందించలేక పోతున్నారని స్థానిక ప్రజలు పేర్కొంటు న్నారు. తిమ్మాపూర్, తపాల్ పూర్, కవ్వాల్, ఇందన్ పల్లి గ్రామాలతో పాటు మరి కొన్ని గ్రామాల్లో శుద్ధ జలాలు అందడంలేదు.అంటే దాదాపు పది గ్రామాల్లో కూడా పూర్తిగా త్రాగు నీటిని అందించలేక పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
పైపులైన్ వేశారు - నీళ్లు ఇవ్వడం మరిచారు.
ప్రజలకు శుద్దజలాలను అందించడం కోసం లక్షల రూపాయల కర్చు చేసి ప్రతి గ్రామానికి పైప్ లైన్ వేశారు కాని త్రాగు నీటిని అందించలేక పావడం పై పలు విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఇందన్ పల్లి గ్రామంతో పాటు మరికొన్ని గ్రామాల్లో  పరిమితమైన వాడలకు నీరు అందిస్తున్న అవి మురికి నీరుగా రావడంతో ఎవ్వరూ కూడా మిషన్ బగీరథ నీటిని త్రాగు నీరు గా బావిండం లేదని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. మిషన్ భగీరథ పథకం రావడంతో చేతిపంపులను నిర్లక్ష్యంగా వదిలేశారు. నేడు ప్రజల దహార్తి తీర్చడానికి చేతిపంపులు కూడా పనికి రాకుండా పోయాయి. దీంతో ప్రజలకు త్రాగు నీటి కష్టాలు మొదలయ్యాయి.  
గ్రామాల్లో తాగునీటి సమస్యల - ఆందోళన కు సిద్దమౌతున్న మహిళలు.
ఎండలు మండిపోతున్నాయి. చేతిపంపులు పనిచేయకుండా పోవడం. మిషన్ భగీరథ నీరు అందించలేకపోవడం తో పల్లెల్లో త్రాగు నీటీ సమస్య కష్టాలు మొదలు కానున్నాయి.అదికారుల నిండా నిర్లక్ష్యం వలన  ప్రజల అగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని మండల ప్రజ‌లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి కైనా అధికారులు నిర్లక్ష్యం వీడాలి. ప్రతి గ్రామంలో పరిశుభ్ర మైన త్రగు నీరు అందించడంతో పాటు నీటి పొదుపు పై అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలి. మరి ఏమేరకు అధికారులు స్పందిస్తారో వేచిచూద్దాం