కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ కేంద్రం, హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చెయ్యాలి

Published: Thursday April 29, 2021

బెల్లంపల్లి మార్చి 28 ప్రజా పాలన ప్రతినిధి : బెల్లంపల్లి నియోజకవర్గం లో ఏర్పాటుచేసిన కరోనా వ్యాక్సిన్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించకుండా వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే అనడం ఆయన అవివేకానికి నిదర్శనమని బెల్లంపల్లి అఖిలపక్షం తీవ్రంగా విమర్శించింది. బుధవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో బెల్లంపల్లి  నియోజకవర్గంలో దాదాపు లక్ష 50 వేలమంది కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తుంటే యువకులు వృద్ధులుఎక్కువ శాతం 18 సంవత్సరాలు పై బడిన వ్యక్తులు ఉంటారని వారికి ఎలాంటి అవగాహన కల్పించకుండా వ్యాక్సినేషన్ సెంటర్లలో కనీస సౌకర్యాలైన మంచినీరు కూర్చోవడానికి బెంచీలు కుర్చీలు నీడ కోసం సరిపడా షామియానాలు కూడా ఏర్పాట్లు  చేయలేదని వ్యాక్సిన్ కోసం వచ్చిన ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని వాటన్నిటిని పరిష్కారం చేయకుండా వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధం కావాలని పిలుపునివ్వడం ఎంతవరకు సబబని  వారన్నారు. లక్షకు పైగా ఉన్న వ్యక్తులకు దాదాపు ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సింగరేణి హాస్పిటల్ లో కమ్యూనిటీ హాస్పిటల్ లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నట్లుగా వ్యాక్సిన్ కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారని చేసుకుంటే సంబంధిత హాస్పిటల్ ఎక్కడికి వెళ్లాలి ఏ వ్యాక్సిన్ సెంటర్కి వెళ్లాలి చెప్పడానికి సిబ్బంది లేరని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లకు ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు కనీస అవసరాలకు ఖర్చు చేయకుండా కేవలం కాగితాలపై లెక్కలు మాత్రమే చూపెడుతూ నిధులను సంబంధిత డాక్టర్లే  స్వాహా చేస్తున్నారని వారు ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి ఎప్పుడు కూడా వైద్య అవసరాల కోసం ఎమ్మెల్యే నిధులను ఖర్చు చేయలేదని ఇప్పటికైనా ఎమ్మెల్యే గారి నిధులతో హాస్పిటల్స్ కు ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేకుండా ప్రతి మండలంలో ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో ఉండే విధంగా హాస్పిటల్స్కు వచ్చే వికలాంగులకు వృద్ధులకు వీల్చైర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, చదువు రాని వారికి సహాయ పడే విధంగా సిబ్బందిని సమకూర్చాలని ప్రభుత్వం అంబులెన్సులు సరిపోయే అంత లేకపోతే అద్దె ప్రాతిపదికన అద్దె అంబులెన్సులను ఏర్పాటు చేయాలని, ఎమ్మెల్యే విడిది కార్యాలయ పరిసర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయం, హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని లేనియెడల అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామని అని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గెల్లీ జయరామ్ యాదవ్, గుండ చంద్ర మాణిక్యం సిపిఐ పట్టణ కార్యదర్శి అమానుల్లాఖాన్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు, బత్తుల మధు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగర్ల శంకర్, రెడ్ స్టార్ పార్టీ  సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాశీ సతీష్ కుమార్, ఇండియా ప్రజాబంధు పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహమ్మద్ గౌస్, హెచ్ఎంఎస్ నాయకులు ఆడెపు మహేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి తదితరులు హాజరైనారు.