ఇబ్రహీంపట్నం డిసెంబర్ 6ప్రజాపాలన ప్రతినిధి *వికలాంగుల చట్టాలను మార్చాలనే కేంద్ర ప్రభుత్వం

Published: Wednesday December 07, 2022

వికలాంగుల చట్టాలను మార్చాలనే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు వికలాంగులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని *వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ జిల్లా కార్యదర్శి జేర్కోని రాజు పిలుపునిచ్చారు*
    ఈ రోజు మంచాల్ మండల కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఎన్ పిఆర్ డి భారత 3వ మహాసభల పోస్టర్ ను విడుదల చేసారు.
      ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలి సారిగా  డిసెంబర్ 26-28 తేదీల్లో NPRD అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు  దేశంలో వికలాంగులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను మార్చాలనే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాడని అన్నారు 2016 RPD చట్టంలోని సెక్షన్ 89,92,93లను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. నేటికీ నేషనల్ ట్రస్ట్కు, వికలాంగుల ప్రధాన కమిషనర్ కార్యాలయాల్లో చైర్మన్లు లేరని అన్నారు. మానసిక వికలాంగుల చట్టం అమల్లోకి వచ్చి అనేక ఎండ్లు గడుస్తున్న ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేయడం ద్వారా వికలాంగులు రిజ్వేషన్ల సౌకర్యం కోల్పోతారని అన్నారు. గడిచిన 8ఎండ్ల కాలంలో దేశవ్యాప్తంగా వికలాంగులపై దాడులు దౌర్జన్యాలు మహిళా వికలాంగులపై లైంగిక వేదింపులు పెరిగిపోతున్నాయని వాటిని ఎందుకు అరికట్టడం లేదని ప్రశ్నించారు. కరోనా వికలాంగుల జీవితాలను ప్రభావితం చేసిందని అన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వికలాంగులను ఉన్నత విద్యకు దూరం చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అఖిల భారత మహాసభల్లో దేశ వ్యాపితంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. దేశ వ్యాపితంగా 22రాష్ట్ర నుండి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.33 జిల్లాలో వికలాంగుల చట్టాలు సంక్షేమ పథకాలపై సెమినార్స్ చర్చగిస్టులు నిర్వహిస్తున్నామని అన్నారు. డిసెంబర్ 26నాడు వేలాది మంది వికలాంగులతో హైదరాబాద్ నగరంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 27, 28తేదీల్లో ప్రతినిధుల సభ ఉంటుందని అన్నారు. హక్కుల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలకు వికలాంగులు అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
   ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు అశ్వాల బాల్ రాజ్ చీర దానయ్య సత్తయ్య గ్యార యదమ్మ మంగ అంజయ్య బుచ్చి రెడ్డి    తదితరులు పాల్గొన్నారు,