అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని వామపక్షాల ధర్నా** తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోట్న

Published: Friday November 18, 2022

ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 17 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద గురువారం వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోట్నాక విజయ్ కుమార్ పూర్తి మద్దతు పలికారు. ఈ సందర్భంగా కోట్నాక విజయ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అవినీతి అక్రమాలను ప్రోత్సహిస్తున్నాడని, ఇంతకుముందు జిల్లాకు వచ్చిన కలెక్టర్లు అవినీతిని అరికడుతూ ప్రజల సమస్యలను తీర్చే వారన్నారు. ఇప్పుడున్న కలెక్టర్ రాహుల్ రాజ్ అత్యంత గౌరవప్రదమైన ఐఏఎస్ ను అవమానం చేసేలా అవినీతి అధికారులను ప్రోత్సహిస్తూ టిఆర్ఎస్ నాయకుడి లాగా పనిచేస్తున్నాడని, కనీసం ప్రజలని ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఆదివాసి హక్కుల పోరాట సాధ్యం దెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీల సమస్యలపై అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చిన కనీసం స్పందన లేకుండా ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన ఆర్డిఓ పై ఇంతవరకు చర్యలు తీసుకోకుండా ఉన్నారని అన్నారు. ఆర్డీవో చేస్తున్న కుంభకోణాలకు ఏమైనా వాటాలు అందుతున్నాయా అని అన్నారు. అధికార పార్టీ అండ దండాలతో ఉన్నారని, ఇలాంటి కలెక్టర్ కొమురం భీం జిల్లాలో పనికిరాడని, వెంటనే ప్రభుత్వం స్పందించి బదిలీ చేయాలని, కోరారు. బదిలీ చేయని యెడల అన్ని సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బిజెపి, కాంగ్రెస్, బీఎస్పీ, వామపక్షాలు విద్యార్థి యువజన సంఘాలు తదితరులు పాల్గొన్నారు.