పాఠశాల ఆవరణాన్ని శుభ్రం చేయిస్తున్న సర్పంచ్

Published: Thursday August 26, 2021
బోనకల్లు, ఆగష్టు 25, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలు గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా మూతబడి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు ఒకటో తారీకు నుండి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రకటించడంతో బోనకల్ మండల కేంద్రంలోని పాఠశాల ఆవరణాన్ని సర్పంచ్ భూక్యా సైదా నాయక్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల చేత పాఠశాల ఆవరణాన్ని శుభ్రం చేయించడం జరిగింది. అంతేకాకుండా సర్పంచ్ కూడా పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ పాఠశాల ఆవరణాన్ని శుభ్రం చేయడం జరిగింది. అనంతరం సర్పంచ్ సైదా నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా తగ్గినందున పాఠశాలలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువలన తల్లిదండ్రులందరూ తమ పిల్లలను పాఠశాలకు పంపించాలాని అన్నారు. అదేవిధంగా పాఠశాల చుట్టూ ఉన్న చెత్త చెదారం పంచాయతీ సిబ్బంది చేత ఎత్తి వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్యా సైదా నాయక్, ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ, పంచాయతీ సెక్రెటరీ కిరణ్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.