ప్రయాణం సంఘం ఆధ్వర్యంలోఖమ్మం జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పి. సోలోమన్ కి వినతి పత్రము

Published: Tuesday February 01, 2022
మధిర జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా TS ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పి.సోలోమన్ కి, మరియు మధిర డిపో మేనేజర్ ని ఖమ్మంలో కలిసి మధిర పట్టణ ఆర్టీసీ ప్రయాణికుల ఇబ్బందులను వివరిస్తూ, కొన్ని ప్రాంతాలకు బస్సులు లేక పడే పాట్లను గురించి పూర్తిగా వారితో సంభాషణ చేయడం జరిగినది. కరోనా కష్టకాలంలో రైళ్లను రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రయాణాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకోవటం ఆర్థిక భారంతో కూడుకున్నదని అందువలన బస్సులను సంబంధిత అధికారుల పర్మిషన్ తో అవసరమగు చోట్ల బస్సులను తిప్ప వలసినదిగా మధిర పట్టణ ప్రజల తరఫున కోరడం జరిగినది. ఈ కార్యక్రమమును యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ టూ ఇన్ఫర్మేషన్ క్యాంపైన్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు మరియు మధిర మండల అధ్యక్షుడు మహంకాళి వెంకట శ్రీనివాసరావు, మధిర పట్టణ రైలు, బస్సు ప్రయాణికుల సంఘం జాయింట్ సెక్రెటరీ కుంచం కృష్ణారావు గార్లు పాల్గొన్నారు. మేడారం జాతర అయిన తరువాత సమస్యలను పరిశీలిస్తామని అధికారులు చెప్పటం జరిగినదియూ ఫ్ ఆర్ టి ఐ క్యాంపెయిన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మరియు మధిర మండలం అధ్యక్షుడు మహంకాళి వెంకట శ్రీనివాసరావు మరియు  రైలు, బస్సు ప్రయాణికుల సంఘం జాయింట్ సెక్రటరీ కుంచం కృష్ణారావు