రమాబాయి అంబేద్కర్: ఆమె స్వంత హక్కులో మార్గదర్శకురాలు,భారతీయ మహిళలు చరిత్ర

Published: Saturday May 28, 2022
మన రాజ్యాంగ నిర్మాతకు మద్దతుగా నిశ్చింతగా నిలబడిన మహిళల్లో రమాబాయి అంబేద్కర్ ఒకరు.*తల్లి రమాబాయి వర్ధంతి*ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి మే 27:ఈరోజు కొడంగల్ లోని అంబేద్కర్ కూడలిలో తల్లి రమాబాయి ఫోటోకు పూలతో నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా,కొడంగల్ నియోజకవర్గ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు U రమేష్ బాబు మాట్లాడుతూ,శతాబ్దాలుగా వర్గ వర్ణ విభజన లతో అతలాకుతలంగా ఉన్న భారత సమాజ ధర్మాన్ని ప్రశ్నించి నిలదీసి సమధర్మం, సమన్యాయం ఏర్పాటుచేసిన మహనీయుడు డా"అంబేద్కర్. ఆయన భార్య రమాబాయి జీవన గమనాన్ని అర్థం చేసుకుంటే, ఆమె కూడా ఆయన మార్గాన్నే ఆమోదించినట్లు స్పాష్టపడుతుంది.పోరాటాలకు, త్యాగాలకు, బాధలు భరించటానికి మనిషి సిద్ధంగా ఉండాలనేవాడు అంబేద్కర్.ఆ మాటలను రమాబాయి తన జీవితానికి ఎంతగా అనువర్తింప చేసుకున్నదో అర్థమవుతుంది.రమాబాయి ఏ రకమైన ప్రలోభాల ను తన దరిదాపుల్లోకి రానీయలేదు, ఔను మా బతుకు దారులు మాకున్నాయి. అన్నట్టు తన భర్త బారిష్టర్ అయినా తను పెడా ఎత్తి పిడకలు చేసి సంసారాన్ని ఎల్లదీసింది.ఆమె తన బాధ్యతను నెరవేర్చిననుకుంది కానీ అతను తెలియకుండానే ఈ అవినీతి పరమైన పురుషాధిక్య వ్యవస్థను దిక్కరించింది.ఆత్మగౌరవ ప్రకటన చేసింది, అందుకే రమాబాయి తన ఇంటికే కాదు ఒక ప్రపంచ మేధావిని తీర్చి దిద్ది ఈ దేశానికే దీపం అయ్యిందని,ఆ మనస్తత్వం మానసిక ధైర్యం మనకు లేవా? లేకుంటే అలవర్చుకోవాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ.జాతీయ అవసరాల గురించే తప్ప కుటుంబం గురించి ఆలోచించే సమయం డా"అంబేద్కర్ ఇవ్వలేదని, ఆయన లక్ష్యం వేరని అర్థం చేసుకొని ఆయన సహధర్మచారిణిగా ఆ బాధ్యతనంతా తన మీద పెట్టుకోంది.అంబేద్కర్ ఈ చదువులకు, విదేశాలకు వెళ్లినప్పుడు ఇక్కడ ఆయన కుటుంబ అవసరాలు నెత్తిన వేసుకొని అంబేద్కర్ విద్యా వ్యాసంగం, సమాజ సంస్కరణ కార్యక్రమాలు, ఉద్యమాలు నిరంతరాయంగా సాగటానికి రమాబాయి ఎంతగానో సహకరించిందని కొనియాడారు.ఈకార్యక్రమంలో
కొడంగల్ నియోజకవర్గ AYS సహాయ కార్యదర్శి:G. అశోక్. కొడంగల్ మండలAYS ఇంచార్జ్: ఎం. వెంకటేశం.లింగన్‌పల్లి సర్పంచ్ : కాశప్ప. చిన్న నందిగామ సర్పంచ్ సాయిలు. ఎరన్ పల్లి సంగప్ప. కొడంగల్ రెండవ కౌన్సిలర్: ఆర్. మధుసూదన్ యాదవ్డి, డి ప్రవీణ్. ఆశన్న. మరియు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, అంబేద్కర్ వాదులు, తదితరులు పాల్గొన్నారు.