బాలల హక్కులకు భరోసా ఏది..?

Published: Tuesday November 15, 2022

మంచిర్యాల టౌన్, నవంబర్ 14, ప్రజాపాలన: నేటి సమాజం లో బాలల హక్కులకు భరోసా లేదని తెలంగాణ బలహీనవర్గాల సంక్షేమ సంఘం అధ్యక్షులు, అడ్వకేట్ రాజలింగు మోతె అన్నారు. సోమవారం బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడారు. బాల్యంలో పొందాల్సిన అన్ని హక్కులనువాళ్లకు అందేలా ప్రభుత్వాలు చూడాలని ఆయన అన్నారు. బాలలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖలతోపాటు చైల్డ్ హెల్ప్ లైన్ పోలీస్ విద్య వైద్య కార్మిక స్వచ్ఛంద సంస్థలు పనిచేయాలన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న బాలలందరికీ ప్రభుత్వ సంస్థలు సహాయం అందించాలన్నారు. గ్రామాల్లో బాల్యవివాహాలు అరికట్టేందుకు అవగాహన కల్పించాలన్నారు. బాలల హక్కుల చట్టాలను అమలుపరిచే బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.గ్రామస్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు బాలల హక్కులు చట్టాలపై విసృత ప్రచారం చేయాలన్నారు.