ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటాన్ని నిలిపివేయాలి : CITU

Published: Saturday October 09, 2021
మధిర, అక్టోబర్ 08, ప్రజాపాలన ప్రతినిధి : ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటాన్ని నిలిపివేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయంముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు మాట్లాడుతూ :కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలను భూములను కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మ వేయటాన్ని వెంటనే విరమించుకోవాలని, అదేవిధంగా రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని, కార్మికుల వ్యతిరేకంగా తీసుకొచ్చిన కోడ్ లను రద్దు చేయాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, షెడ్యూలు పరిశ్రమల్లో కార్మికుల వేతనాలు సవరించాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ సైదులు గారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తేలప్రోలు రాధాకృష్ణ, పడకంటి మురళి, సిపిఎంమండల కార్యదర్శి మంద సైదులు, డివైఎఫ్ఐ  జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధు, మధిర టౌన్ కమిటీ సభ్యులు దోర్నాల విజయ్, హమాలీ వర్కర్ల రాష్ట్ర కమిటీ సభ్యులు నామాల శ్రీను, మేస్త్రీలు ఎర్రిబోయిన రాము, కృష్ణా, పుల్లయ్య, ఆర్డబ్ల్యూఎస్ నాయకులు వెంకయ్య, సుబ్బారావు, సీఐటీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు...