గురుకుల కెజిబివి, సమగ్ర శిక్ష సిబ్బందికి పిఆర్సీ ఉత్తర్వులు విడుదల చేయాలి

Published: Thursday September 09, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 08, ప్రజాపాలన ప్రతినిధి : వివిధ మేనేజ్మెంట్లలోని గురుకుల పాఠశాలల సిబ్బందికి, కెజిబివి సిబ్బందికి, సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు పిఆర్సీ ఉత్తర్వులు వెంటనే విడుదల చేసి ఏప్రిల్ నుండి ఆర్థికలాభం వర్తింప చేయాలని టియస్ యుటియఫ్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతురామకృష్ణ, మండల అధ్యక్షులు కంభం రమేష్, బుధవారం భోజన విరామ సమయంలో కేజీబీవీ, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, మరియు యం ఆర్ సి ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం గురుకులాలకు, కెజిబివి సిబ్బందికి పిఆర్సీ ఉత్తర్వులు ఇవ్వకుండా తాత్సారం చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగులు అందరికీ వేతన సవరణ అమలుకు ఉత్తర్వులు ఇచ్చి మూడు నెలలు గడిచాయి. వారు రెండు నెలలుగా నూతన వేతనాలు తీసుకుంటున్నారు. సోషల్ వెల్ఫేర్, బిసి వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల యాజమాన్యాలలో నిర్వహించబడుతున్న విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన బోధనేతర ఉద్యోగులకు కెజిబివి తదితర సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు పిఆర్సీ అమలుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినప్పటికీ ఆయా శాఖలు అనుబంధ ఉత్తర్వులు ఇవ్వటంలో జరుగుతున్న అసాధారణ జాప్యం వలన సంబంధిత ఉద్యోగులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పిఆర్సీ ఉత్తర్వులు విడుదల కావాలంటే దక్షిణలు సమర్పించుకోవాలంటూ కొందరు ప్రలోభాలకు గురిచేస్తూ వసూళ్ళకు పూనుకుంటున్నట్లు టిఎస్ యుటిఎఫ్ దృష్టికి వచ్చింది. ఉత్తర్వుల విడుదలలో జాప్యమే ఇటువంటి అపసవ్యతకు కారణం కనుక ప్రభుత్వం వెంటనే పిఆర్సీ అమలు ఉత్తర్వులు విడుదల చేసి ఉపాధ్యాయులు ఉద్యోగుల ఆందోళనను నివారించాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి కోరారు. సమస్యలు  పరిష్కారం కాకుంటే సెప్టెంబర్ 3వ వారంలో రాష్ట్ర స్థాయిలో మహాధర్నా నిర్వహించాలని టిఎస్ యుటిఎఫ్ నిర్ణయించిందని తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టియస్ యుటియఫ్  మండల అధ్యక్షులు కంభం రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు. రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఎం సి ఆర్ చంద్ర ప్రసాద్, బి.ప్రీతం, ఉపాధ్యక్షురాలు పి సుశీల, పి గోపాల్ రావు, చిన్న రంగారావు, కేజీబీవీ ఎస్ ఓ కమల వాహిని, కవిత, వసుంధర, రాణి, రత్నమాల, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు పి పుల్లా రాణి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ సిహెచ్ రాంబాబు, సి ఆర్ పి ల సంఘం నాయకులు ఎస్ కే పాషా, రమేష్, ఎస్ కె నాగులుమీరా, అబ్రహం, సూరయ్య, సోషల్ వెల్ఫేర్ మరియు బిసి వెల్ఫేర్ గురుకుల ఉపాధ్యాయులు, గురుకుల సిబ్బంది పాల్గొన్నారు.