ఈడికి లొంగే ప్రసక్తే లేదు

Published: Tuesday December 27, 2022
 జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్
వికారాబాద్ బ్యూరో 26 డిసెంబర్ ప్రజా పాలన : నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నాయకులను ఇన్వెస్టిగేషన్ సంస్థలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్ విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుండి 2022 వరకు 3500 ఈడి రైట్స్ చేయించారన్నారు. నిజ నిర్ధారణ అయినవి కేవలం 23 కేసులు మాత్రమేనని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్పొరేటర్లకు తాకట్టుపెట్టి భారత ఆర్థిక వ్యవస్థను అప్పుల కుప్పగా మార్చాలని ధ్వజమెత్తారు. నీరో మోదీ అదాని అంబానీలకు కొమ్ముకాస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని జోష్యం చెప్పారు. 1980 సంవత్సరంలో రిలీజ్ అయిన దివార్ సినిమాలో అమితాబచ్చన్ నా దగ్గర డబ్బు అధికారం అనుచర గణం ఉంది అని రిషికపూర్ తో చెప్పాడన్నారు. రిషి కపూర్ మాత్రం నా దగ్గర అమ్మ మాత్రమే ఉందని గుర్తు చేశారు. ఎవరైతే అహంకారంతో విర్రవీగితే వారికి పతనం తప్పదని హెచ్చరించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అని ఘంటాపథంగా చెప్పారు. మోడీలను కేడీలను ఈడీలను నిర్భయంగా చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని చెప్పారని అన్నారు. బిజెపిని విమర్శిస్తే ప్రతిపక్ష పార్టీలపై ఈడి దాడులు చేయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ఇబ్బందుల పాలు చేసేందుకు ఈడీ రైడ్ చేయించడం అవివేకం అని ఘాటుగా స్పందించారు. ఏ ఇన్వెస్టిగేషన్ సంస్థకు భయపడం ఎందుకంటే మేము ఏ తప్పు చేయలేదని విశ్వాసం వ్యక్తం చేశారు.