క్రీడలతో నాయకత్వ లక్షణాలు వృద్ధి

Published: Tuesday January 10, 2023
 యజ్ఞ ఫౌండేషన్ కరస్పాండెంట్ డాక్టర్ ఉజ్వల్
వికారాబాద్ బ్యూరో 9 జనవరి ప్రజాపాలన : క్రీడలతో మానసికోల్లాసం చురుఠుదనం సమయస్ఫూర్తి నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయని యజ్ఞ ఫౌండేషన్ కరస్పాండెంట్ డాక్టర్ ఉజ్వల్ అన్నారు. సోమవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ధన్నారం గ్రామ సమీపంలో స్వామి వివేకానంద గురుకుల్ హ్యూమన్ ఎక్సలెన్స్ లో జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలబాలికలకు ఖోఖో, చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో సుమారుగా 20 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఖోఖో ఆటల పోటీల నిర్వహణలో న్యాయ నిర్ణేతలుగా వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతాప రెడ్డి పిఈటీలు పాల్గొన్నారు. చెస్ నిర్వహణ ఆటల పోటీలో అనిత రాణి, గంగా ప్రసాద్ నిర్వహించారు. ఆటల ద్వారా విద్యార్థులకు చురుకుదనము, కలివిడితనము, స్నేహభావము శరీర దారుఢ్యం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులు చదువులో కూడా చక్కగా రాణిస్తారని వెల్లడించారు. ఆటల ద్వారా ప్రేరణ  పొందిన విద్యార్థులు ముందు ముందు రాష్ట్ర స్థాయిలో పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు భోజన వసతి కల్పించి వారిని ఆనందపరిచి ఆశీర్వదించారు.