ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 31 ప్రజాపాలన ప్రతినిధి *డి ఆర్ డి ఏ సర్ఫ్ అధ్వర్యమలో మహిళా సంఘాలకు ఋణా

Published: Wednesday February 01, 2023

ఇబ్రహీంపట్నం  మండల కేంద్రంలో  మండల మహిళా సమైక్య  డి ఆర్ డి ఏ  సేర్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రుణాల పంపిణీ కార్యక్రమలో ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ మంచి రెడ్డి కిషన్ రెడ్డి  హాజరై మొదటగా మహిళా సంఘాల ద్వారా చేసిన ఉత్పత్తుల స్టాల్స్ ను ప్రారంభించినారు.తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని సేర్ప్  ప్రార్థన గీతంతో ప్రారంబించారు, కార్యక్రమంలో సర్ఫ్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి సబ్జెక్టుల వారిగా  డిపిఎం లతో మాట్లాడించడం జరిగింది. అదేవిధంగా మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు సమైక్య చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు మరియు అడిషనల్  డి ఆర్ డి ఓ డిఆర్డిఏ  కార్యక్రమాల గురించి వివరించడం  జరిగింది.ఎంపీపీ కృపేష్   మాట్లాడుతూ చిన్న సంఘాలు మరియు సమావేశాలు చేసుకోవడానికి భవనాల నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. జడ్పిటిసి మహిపాల్  మాట్లాడుతూ సంఘలలోని  కుటుంబాలు వారి పిల్లల్ని చదువుల పట్ల శ్రద్ధ చూపాలి అన్నారు.అదేవిధంగా మహిళలు తీసుకున్న రుణాలు బ్యాంకు లింకేజ్,స్త్రీనిది  ద్వారా వ్యాపారాలు స్థానికంగా మరియు ఆన్లైన్ ద్వారా నిర్వహించుకోవాలి అని అన్నారు, పిడి డిఆర్డిఏ ప్రభాకర్  మాట్లాడుతూ ప్రతి మహిళా సంఘానికి రుణ సౌకర్యం  కల్పించి సుస్తిరమైన జీవనోపాధిని కల్పిస్తున్నామని చెప్పారు, మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు 100కు 100% తిరిగి చెల్లిస్తున్నారు, మహిళా సంఘాలు ఆర్థిక పరమైన చెల్లింపులు ఆన్లైన్ పద్ధతిలో కొనసాగిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అన్నారు మహిళలకు అత్యవసర రుణాలు అవసరమైనప్పుడు రుణాలు పొందవచ్చునని తెలియజేసినారు, ముఖ్య అతిథి స్థానిక శాశన సభ్యులు  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  మాట్లాడుతూ సంఘాలు ఒక లక్ష రూపాయలు రుణం నుండి ఈరోజు 20 లక్షల రూపాయల వరకు రుణాలు పొందే స్థాయికి ఎదగారని  మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా అందిస్తున్నామని చెప్పారు మన మహిళా సంఘాలు రాష్ట్రానికి, దేశానికి ఆదర్శం అన్నారు, మహిళా సంఘాలకు సొంత భవనాల నిర్మాణానికి కృషిచేస్తానన్నారు,మహిళా సంఘ సభ్యులు ఏర్పాటు చేసుకున్న ఎంటర్ పైజేస్ గురించి ముఖాముఖి నిర్వహించి  వివరాలు తెలుసుకున్నారు,మండలంలోని 921  స్వయం సహాయక సంఘాలు ఉండగా  అందులో 617  సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 34 కోట్ల 25 లక్షల రూపాయలు మరియు స్త్రీనిది  ద్వారా 237 సంఘాలకు 3 కోట్ల 85 లక్షల రూపాయల చెక్కులను  లబ్ధిదారులకు అందజేశారు ఈయొక్క రుణాల ద్వారా 8750 మంది లబ్దిపొందుతున్నారని మరియు ఎంటర్ప్రైజెస్ ద్వారా 343 మంది సభ్యులు వివిధ రకాల చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు అని చెప్పారు అదే విదంగా పుడ్ ప్రాసెసింగ్ (PMFME) క్రింద 5 మంది సభ్యులు లబ్ధి పొందినారు,మహిళా సంఘాలు అన్ని ఆదర్శంగా పనిచేస్తున్నాయని, ఈ యొక్క సంఘాల పురోగతికి పనిచేస్తున్న  డి ఆర్ డి ఏ సేర్ఫ్ సిబ్బందిని అభినందించడం జరిగింది,ఈ కార్యక్రమంలో పిడి  డిఆర్డిఓ  పి ప్రభాకర్ ,ఎంపీపీ కృపేష్ , జెడ్పిటిసి మహిపాల్ ,జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి ,ఎంపీడీవో జయరాం విజయ్ , డిపిఎం లు బాల్ రాజ్,నర్సింహ,స్వర్ణలత ,సూర్య,RM ఉదయ, మండల మహిళా సమైక్య అధ్యక్షులు నిర్మల,కార్యదర్శి మహేశ్వరి,కోశాధికారి జ్యోతి,ఎపియం,సీసీలు, SN మేనేజర్,వివోఏలు మరియు మండల మహిళా సమైక్య సిబ్బంది,అన్ని గ్రామాల నుండి 600 మంది సంఘ సభ్యులు పాల్గొన్నారు.