సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాతూరి కృష్ణ దశదిన కర్మకు హాజరైన మండల కాంగ్రెస్ నాయకులు

Published: Monday January 10, 2022
ఎర్రుపాలెం డిసెంబర్ 9 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలోని జమలాపురం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పాతూరి కృష్ణ దశదినకర్మ కు హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించిన మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పాతూరి కృష్ణ కాంగ్రెస్ పార్టీ కి ఎన్నో సేవలు చేశారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బండారు నరసింహారావు, నాయకులు కంచర్ల వెంకట నరసయ్య, షేక్ ఇస్మాయిల్, దేవరకొండ శ్రీనివాసరావు, లింగాల నాగేశ్వరరావు, బానావత్ శ్రీను తదితరులు ఉన్నారు.