వీఆర్ఏ సమస్యలను వెంటనే పరిష్కరించాలి-------- సిపిఐ ఎర్రబాబు--------------------

Published: Wednesday July 27, 2022

---వైరా మండలం వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో వైరా ఎమ్మార్వో ఆఫీస్ వద్ద గత రెండు రోజులుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న సందర్భంగా సిపిఐ బృందం వెళ్లి వీఆర్ఏజేఏసీ ఆధ్వర్యంలో దీక్ష దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలుపటం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏరా బాబు మాట్లాడుతూ నేటి తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు ఎలాంటి డోకా లేదని చెప్పి నమ్మించి వారి ఆశయాలకు రెక్కలు చూపించి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఆశల వాళ్లకి చూపుతో కాలయాపన చేస్తున్నారని చిన్న ఉద్యోగుల జీవితాలు చులకనగా చూస్తూ కుటుంబాలను రోడ్డున పడే పరిస్థితి ఏర్పాటు ఏర్పడే విధంగా చేసిందని ఎద్దేవాచేశారు, నిత్యవసర సరుకులు రోజురోజుకు పెరిగిపోతూ ఉంటే చాలు చాలని జీతాలతో పిల్లలను చదివించుకోలేక కుటుంబాలను పోషించుకోలేక వీఆర్ఏలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నేటి ప్రభుత్వం చూస్తున్నామని వారన్నారు, ఇప్పటికైనా నేటి ప్రభుత్వం కళ్లు తెరచి లోకాన్ని చూసి వీఆర్ఏల కుటుంబాలు పడుతున్న పరిస్థితిని చేరిపార చూసి వారి సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొండపాటి రమేష్, సిపిఐ వైరా మండల కార్యదర్శి యామాల గోపాలరావు ,గారపాటి అశోక్ ,షేక్ షరీఫ్, మూటకొండ, కొండా రామకృష్ణ ,మిట్టపల్లి రాఘవరావు, తదితరులు పాల్గొన్నారు.