వికలాంగురాలు జ్యోతి చదువుకు సహాయం చేసిన చేడే శ్రీనివాస్ మిత్ర బృందం

Published: Monday October 11, 2021
మధిర, అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : దీనులను కాపాడు టకు దేవుడే వున్నాడు దేవుని నమ్మిన వాడు ఎన్నటికీ చెడిప నిజంగా ఈ మాటల్లో ఎంతో అర్ధం వుంది అని సినీ కవి చెప్పిన మాటలు గుర్తు కు వస్తున్నాయ్ కదూఎంత సంపాదించిన ఏమి తీసుకోనిపోము వట్టి చేతులతో వెళ్ళాలి ఎవరైనా కానీ భూమి మీద బ్రతికి నంత కాలం కొన్నైనా పుణ్య కార్యాలు చేస్తే దేవుడు మెచ్చు కుంటాడు. సరిగ్గా అదే బాటలో నడుస్తూన్నారు ప్రముఖ ఉపాధ్యాయులు మధిరకు చెందిన చేడే శ్రీనివాస్ మిత్ర బృందం ఐన హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీరు ప్రదీప్ మరియు చేడే శ్రీనివాస్ బంధువు ప్రదీప్, స్నేహితులు వెలివెల శ్రీధర్ అందరు కలసి వికలాంగురాలు ఐన జ్యోతి అనే పేదింటి దళిత కుటుంబంనకు చెందిన అమ్మాయిని చదిస్తున్నారు వివరాల్లోకి వెళితే మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన కారుమంచి క్రిష్ణయ్య డప్పు కళాకారుడు నిరుపేద కుటంబంనకు చెందిన 3వ ఆడపిల్ల కారుమంచి జ్యోతి 22 సంవత్సరాలు, శారీరవికలాంగురాలును ఆర్ధిక పరి స్థితి బాగా లేక చదువు మానేసింది. ఈ విషయం ప్రముఖ సామాజిక సేవకుడు లంకా కొండయ్య దృష్టికి రాగ  తన మిత్రుడు ఐన చేడే శ్రీనుకు  తెలియచేయగా వెంటనే స్పాందించి కొండయ్య ద్వారా చిత్తూరు జిల్లా పుత్తూరు లో వెట న్నరీ అసిస్టెంట్ డిప్లమో జాయిన్ చేసి రెండు సంవత్సరాలకు అయ్యే ఖర్చు చేడే బంధువు సాఫ్ట్వేర్ ఇంజనీరు ప్రదీప్ లు పూర్తిగా చదివించే బాధ్యత తీసుకున్నారు. కొండయ్య చొర్వతో జ్యోతి చదువుకు కావాలసిన ఏర్పాట్లు చేడే శ్రీను, బంధువు ప్రదీప్, స్నేహితులు వెలివెల శ్రీధర్ సహాయం చేస్తాం అని వారు తెలియజేసినారు అని కొండయ్య తెలిపినారు. అదే విధముగా జ్యోతి చదువుకు సహాయం విషయంలో సిరిపురం అవధానుల రామకృష్ణ శాస్త్రి మరియు మధిర హరి రవిశాస్త్రి మరియు తొండల గోపవరం రైతు సోదరుడు మన్నేపల్లి గోపి చౌదరి కూడా కారు మంచి జ్యోతికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవటం అభినందనీయం అని లంకా కొండయ్య హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.