ఘనంగా కాంగ్రెస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు

Published: Saturday February 11, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 10 (ప్రజాపాలన ప్రతినిధి)
 ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి  జన్మదిన వేడుకలను హబ్సిగూడలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. రాగిడి లక్ష్మారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లో  సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు.
 ఉప్పల్ డివిజన్లోని స్వరూప్ నగర్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాగిడి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు కోలాహలంగా నిర్వహించారు.  
 ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం నిర్వాహకులు, శిక్షణా కేంద్రం మహిళలు రాగిడి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రాగిడి లక్ష్మారెడ్డి జన్మదిన సందర్భంగా హబ్సిగూడ డివిజన్ వివి నగర్లో గల కార్యాలయంలో  మెగా రక్తదాన శిబిరాన్ని కార్యకర్తలు అభిమానులు ఏర్పాటు చేసి రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. అనంతరం హబ్సిగూడ డివిజన్ పరిధిలోని వివి నగర్ లో ఏర్పాటుచేసిన జన్మదిన కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లో నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాణాసంచా పేల్చి, డప్పు వాయిద్యాలతో, గజమాలతో రాగిడి లక్ష్మారెడ్డి సత్కరించారు.
రాగిడి లక్ష్మారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో టిపిసిసి మేకల శివారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మేడల మల్లికార్జున్, సుధాకర్ శెట్టి, తోఫిక్, రఫిక్,ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లకు సంబంధించిన కంటెస్టెడ్ కార్పొరేటర్లు, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన విభాగం, విద్యార్థి విభాగం, మహిళా విభాగం, ఎస్సీ సెల్ విభాగం, ఎస్టీ సెల్ భాగం, మైనార్టీ విభాగం, జనరల్ విభాగం, సేవాదళ్, ఎన్ ఎస్ యు ఐ,  తదితర విభాగాల చెందిన నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.