పసుర గ్రూప్ అధినేత కీర్తిశేషులు పబ్బతి మోహన్ జయంతి వేడుకలు

Published: Friday February 10, 2023
మధిర ఫిబ్రవరి 9 ప్రజాపాలన ప్రతినిధిమధిర మున్సిపాలిటీ పరిధిలో  ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా కళ్యాణ మండపం నందు ఈ రోజున పసుర గ్రూప్స్ అధినేత, పబ్బతి మోహన్ జయంతి*వేడుకలు ఘనంగా నిర్వహించిన ఈ సందర్భంగా సాయి భక్తులు మాట్లాడుతూప్రతి పేదవాడికి ఎప్పుడు ఏది అవసరం వచ్చినా పిలవగానే పలికే గుప్త, ఎంతోమందికి సేవ చేసి ఎంతోమంది పేద విద్యార్థులకు చదువు చెప్పించి, ప్రతి సంవత్సరం మధిర అయ్యప్ప స్వాములకు అయ్యప్ప స్వామి గుడి దగ్గర 16 మండల పూజల్లోభాగంగా 63 రోజులు మాలాదారులకు అన్నదానానికి బియ్యాన్ని పంపించిఅన్నదాత అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అనేక దేవాలయాల్లో అనేక సాయసహకారాలుఅందిస్తూ ప్రజలుమున్సిపాలిటీ పరిధిలో కరోనా టైములో శానిటైజర్లు, శానిటైజర్ చేయటానికి మిషన్లు అలాగే హైదరాబాద్ మున్సిపాలిటీ లోకూడా కొన్ని వేలు ఖర్చు పెట్టి శానిటైజర్ మిషన్లు అందించి, ఎక్కడ అన్నదానాలు జరిగిన నాది అని ఎంతో కొంత సహకారం అందించి, ఎంతోమంది పేద ఆర్యవైశ్యులకి సహాయం అందించి, పసురగ్రూప్స్ సంస్థను స్థాపించి ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించి, మధిరలో శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయాన్ని నిర్మించి, అలాగే మధిర ప్రజలకు అందుబాటులో పెళ్లిళ్లకు ,ఫంక్షన్లకు కళ్యాణ మండపం నిర్మించి, ఎన్నో ఆర్యవైశ్య పదవులను అలంకరించి, దివికేగిన పశుర గ్రూప్స్ అధినేత కీర్తిశేషులు పబ్బతి మోహన్ జయంతి సందర్భంగా మధిరలో ఆర్యవైశ్య ప్రముఖులు, బంధువులు, స్నేహితులు వారి ఆధ్వర్యంలో  ఘనంగా  నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు*ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండప అధ్యక్షుడు కురువెళ్ల కృష్ణ, దేవి శెట్టి రంగారావు, నంబూరి శ్రీహరి రావు, ప ల్లపోతుల ప్రసాద్, పబ్బతి నాగేశ్వరరావు, సత్యవతి, రాము తదితరులు పాల్గొన్నారు*