సైనిక ఆర్థిక వనరులను తగ్గించేందుకే అగ్నిపథ్

Published: Tuesday June 28, 2022
కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో జూన్ 27 ప్రజా పాలన : సైనిక పరంగా ఆర్థిక వనరులను తగ్గించేందుకే అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు భాగంలో అగ్నిపథ్ పాలసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ భారత దేశ సైనికులు అవమానపరుస్తూ ఆర్మీ అభ్యర్థులకు అన్యాయం చేస్తూ యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసే అగ్నిపథ్ పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ రక్షణకు ఉపయోగపడే సైనికులను శాశ్వత నియామకాలు చేపట్టాలని హితువు పలికారు. నాలుగు సంవత్సరాల కాలం పూర్తిగా విధులు నిర్వహించిన తర్వాత ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి అగ్నిపథ్ ద్వారా వస్తుందని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రైవేటీకరణకు మొగ్గు చూపడం అన్యాయమని స్పష్టం చేశారు. దేశ రక్షణకు నైపుణ్యముతో శిక్షణ పొందిన సైనికులకు పని కల్పించకపోతే ఉంటే వారు అసాంఘిక కార్యకలాపాల వైపు వెళ్ళరా అని ప్రశ్నించారు. దేశ రక్షణకు ఉపయోగపడే సైనికులను వాచ్మెన్ గా నియామకం చేస్తామని బీజేపీ ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదం విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ఉనికి కోసం దేశ రక్షణ వ్యవస్థను వాడుకోవడం అవివేకమని దెప్పిపొడిచారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి ఇ వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ మాజీ జెడ్పిటిసి మైపాల్ రెడ్డి కౌన్సిలర్లు వేణుగోపాల్ మురళి కాంగ్రెస్ కార్యకర్తలు సంతోష్ గౌడ్ వాజిద్ కమాల్ రెడ్డి చాపల శ్రీనివాస్ ముదిరాజ్ చామల రఘుపతి రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ పెండ్యాల అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.