లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం వేడుకలు

Published: Tuesday November 15, 2022

మధిర  నవంబర్, 14 ప్రజా పాలన ప్రతినిధి
మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు బాలల దినోత్సవం సందర్భంగానవంబర్, 14 బాలల దినోత్సవం సందర్భంగా మధిర ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ మధిర గోల్డ్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా లయన్ నంబూరు మధుసూదన్ రావు, కమ్యూనిటీ సర్వీస్ గారి ఆర్థిక సహకారంతో రు. 8,000 విలువ గలిగిన *గేమ్స్ కిట్* అందజేయడం జరిగింది.బాలికొన్నతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎంశ్రీలత అధ్యక్షత న జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వనమా వేణుగోపాలరావు సూరి,  క్లబ్ అధ్యక్షులు  చారుగుండ్ల వెంకట లక్ష్మీ నరసింహారావు, కార్యదర్శి కుంచం కృష్ణారావు, దాచేపల్లి రాము, గేమ్స్ టీచర్ ఎం అపర్ణ, అధ్యాపక బృందం పి రాజ్యలక్ష్మి, శైలజ, ప్రసూన, మంగతాయారు, స్వప్న, కృష్ణారాణి, శశి శ్రీ, శాంతి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.