గిరిజనుల భూమి సరిహద్దు వివరాలు ఇవ్వగలరు

Published: Wednesday December 28, 2022

జన్నారం, డిసెంబర్ 27, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిందనపల్లి రేంజ్ పరిధిలో నీ కవ్వాల్ శివారులో కొత్తపేట రాయకుంట గ్రామానికి చెందిన టేకం అన్ని భాయ్ భర్త భీము టేకం అయు బాయ్ భర్త ధర్ము ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నెంబర్ 1930010086 లో గల సర్వేనెంబర్ 243 భూమి విస్తీర్ణం ఐదు ఎకరాలు భూమి మీద ఇద్దరు గిరిజనులు గొడవ పడుతున్నారని భూమి సరిహద్దు వివరాలు ఇవ్వగలరని మంగళవారం ఇంధన్ పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా భూమి పై ఇందన్ పల్లి రేంజ్ పరిధిలోని కవ్వాల్సివార్లో ఆ భూమిపై ఇద్దరి గిరిజనులు గొడవ పడుతున్నారు అట్టి భూమిలో ఐదు ఎకరాల అటవీ భూమి పట్ట చందు నాయక్ పేరు మీద ఉన్నదన్నారు ఆ భూమి యొక్క సరిహద్దులు చూపెట్టి మిగిలిన భూమి ఎంత వారికి కూడా ఇంత అయినది లేనిది తేల్చి వివరాలు ఇవ్వగలరని వారు కోరారు. కవ్వాల్ హాస్టల్ తండాకు చెందిన చందు నాయక్ నాది అని గొడవ పడుతున్నాడని, ఈ గొడవలు ముదిరి శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నాయన్నారు. మండల మా ప్రజా సంఘాల వినతి మేరకు అట్టి భూమి ఎవరి పేరు మీద కలదు ఫారెస్ట్ మ్యాప్ ద్వారా ఎవరు కాలిలో ఉన్నారు. ఖాళీ భూమి ఎంత కలదు అట్టి భూమి ఎక్కడెక్కడ ఉన్నది, మ్యాప్ ద్వారా తేల్చి గొడవలు జరగకుండా, సర్వే చేసి పూర్తి వివరాలు ఇవ్వగలరని గిరిజనులు కోరారు. ఈ కార్యక్రమంలో భత్తుల ప్రకాష్, నేతవత్ రాందాస్, ఆత్రం సుగుణ, బి రామారావు, కె అనిత, ఎస్కే అబ్దుల్లా, అమృత రావు, బి భాగ్యరావు, తదితరులు పాల్గొన్నారు.