బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు , మరియు భద్రాద

Published: Wednesday September 21, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నందు మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారు, జిల్లా కలెక్టర్ శ్రీ దురిశెట్టి అనుదీప్ గారు* 
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు మాట్లాడుతూ,
 పరిపాలనను వ్యవసాయం వంటి అన్ని రంగాలను అభివృద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణనే సీఎం కేసీఆర్ గారు పండగ చేస్తున్నారు అన్నారు, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, బతుకమ్మ పండుగ గాని ప్రభుత్వమే ప్రజలకు బట్టలు పెట్టి పండుగను చేయడం దేశ చరిత్రలో ఎక్కడ లేదని అన్నారు, సీఎం కేసీఆర్ గారు 2017లో బతుకమ్మ పండుగ అని రాష్ట్ర పండుగగా ప్రకటించారు అన్నారు, దారిద్ర రేఖకు దివ్గానే ఉన్న 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు పంపిణీ చేస్తున్నమన్నారు, తెలంగాణలోని ఆడపడుచులకు సారేగా చీరను బహుమతిగా సీఎం కేసీఆర్ గారు ఇస్తున్నారు అన్నారు, బతుకమ్మ పండుగకు ఒక వారం ముందు నుంచి ఇళ్లలో హడావుడి మొదలవుతుందని ప్రధాన పండుగకు వారం రోజుల ముందు నుంచి తెలంగాణ ఆడపడుచులు చిన్న చిన్న బతుకమ్మలు తయారు చేసి పదిరోజులు సాయంత్రం బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారని గుర్తు చేశారు, ఆ తర్వాత చెరువులో బతుకమ్మని నిమర్జనం చేస్తారని, బతుకమ్మ పండుగ చివరి రోజు జరిగే వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని అన్నారు, తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారని, సీఎం కేసీఆర్ గారు ఆడపడుచులకు చీరలను అందజేస్తున్నామన్నారు, మహిళలు అభివృద్ధికి ఎంతో కృషి ఉంటుందని వారన్నారు రాష్ట్రంలో ఆడబిడ్డలు ఆటపాటలతో సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలి అని సీఎం కేసీఆర్ గారు మహిళలందరికీ బతుకమ్మ చీరలు అందజేస్తున్నామన్నారు బతుకమ్మ చీరల తయారీలో చేనేత కార్మికులకు భాగ్య సామ్యం చేస్తూ వారికి ఉపాధి భరోసా కల్పిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వర్లు గారు, ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి  భానుత్ హరిప్రియ నాయక్ గారు, అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మెచ్చే నాగేశ్వరరావు గారు, ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ తాత మధు గారు, జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ వినీత్ గారు, భద్రాచలం ఐటీడీఏ పీవో శ్రీ గౌతమ్ పోట్రు గారు, జిల్లా ఫారెస్ట్ అధికారి DFO శ్రీ రంజిత్ నాయక్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ కర్నాటి వెంకటేశ్వర్లు గారు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు*