ఎల్లకొండలో హరిత హారంలో నాటిన మొక్కలకు రక్షణ కరువు

Published: Thursday April 29, 2021
ఎవరెస్ట్ శిఖర పర్వతారోహకుడు తిరుపతి రెడ్డి
వికారాబాద్, ఏప్రిల్ 28, ప్రజాపాలన బ్యూరో : సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి పనుల్లో భాగంగా హరిత హారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారని ఎవరెస్ట్ శిఖర పర్వతారోహకుడు తిరుపతి రెడ్డి అన్నారు. బుధవారం నవాబ్ పేట్ మండల పరిధిలోని ఎల్లకొండ గ్రామంలో హరిత హారంలో నాటిన మొక్కలను రక్షించాలని గ్రామ కార్యదర్శి ఎం.వెంకటలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లకొండ గ్రామ శివారు నుండి గేటు వరకు సుమారు ఒక కి.మీ. రోడ్డుకు ఇరువైపుల మొక్కలను నాటించారు. నాటిన మొక్కలలో ఎక్కువ సంఖ్యలో కొన్ని ఎండిపోగా మరికొన్ని మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామాధికారుల నిర్లక్ష్యం కారణంగానే హరిత హారం మొక్కలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. హరిత హారంలో నాటిన మొక్కల విలువ సుమారు 7,81,166 రూపాయల నష్టం జరిగిందని పేర్కొన్నారు.