స్తంభించిన పంచాయతీలు: సర్పంచ్ మర్రి తిరుపతిరావు

Published: Thursday September 16, 2021
బోనకల్, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ పంచాయతీల వ్యవస్థను నిర్వీర్యం కనపడుతుంది సర్పంచులు పై భారం చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీల్లో చేసిన అన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాలు పనులు శానిటేషన్ పల్లె ప్రగతి హరితహారం డ్రైనేజీ లో మురికిని తొలగించడం నర్సరీ పనులు మోటార్ రిపేర్లు గ్రామ పంచాయతీల్లో విద్యుత్ సరఫరా కార్యక్రమాలు ఇతర పనులుఆన్ని అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షించి వేగవంతంగా పూర్తి చేయడంతో సర్పంచులు తమ సొంత డబ్బులు ఖర్చు చేశారు. ఒక్కో పంచాయితీలో 4 నుండి 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టి ఉన్నారు. చాలా మంది అప్పులు చేసి ఖర్చు చేశారు. అయితే ప్రభుత్వం నుంచి జిల్లాకు కోట్ల రూపాయల రావాల్సిన బిల్లులు మంజూరు కావడం లేదని సర్పంచులు చెప్పుకుంటూ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అందువలన వారిపై వడ్డీల భారం అధికమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ మర్రి తిరుపతిరావు మూడు నెలలుగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెట్టిన ఖర్చుల రాక జేబులకు చిల్లులు పడి మనోవేదనకు గురు అవుతున్నాము. చేసే పనులకు నిర్లక్ష్యం ఆటంకం కలుగుతుంది అదేవిధంగా మూడు నెలలుగా మల్టీపర్పస్ జీతాలు రావడం లేదు వారు కూడా మా జీతాలు సంగతి ఏంటి మేము ఎలా బ్రతకాలి అంటూ మేము పనులు ఉద్యోగం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ వి జీ ఎస్ పనులుకూడ మొక్కలకు నీరు పోచే వర్కర్లకు కూడా రావలసిన జితాలు మూడు నెలలుగా జీతాలు లేవు వారి పరిస్థితికి కూడా మా దగ్గర సమాధానం లేదు ప్రతిరోజు వారిని మభ్యపెట్టి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రెజరీ లో వేసిన చెక్కులు కూడా నెలల తరబడి జాప్యం జరుగుతుంది ఇప్పటికే ప్రభుత్వం నుండి రావలసిన టి ఎఫ్ సి ఎఫ్ఎస్సి నిధుల నుండి కోతలు విధించారు. భవిష్యత్తులో ఇలా ఉంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని కావునా సర్పంచులను మనొవేదనకు గురికాకుండా చేయాలని అధికారులను కోరుతూ ఆవేదన పడుతున్నాము.