కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి విగ్నేశ్వరుని లడ్డు ను బహుమానంగా : అందెల

Published: Thursday September 23, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 22, ప్రజాపాలన ప్రతినిధి : నవరాత్రులలో భక్తులందరూ భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న విగ్నేశ్వరుని లడ్డూ ప్రసాదం తీసుకునే భాగ్యం కలిగిందినీ బిజెపి బడంగ్ పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నాదర్గుల్ గ్రామంలో వివేకానంద యూత్ అసోసియేషన్, మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ గణేషు ఉత్సవ సమితి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టించిన లంబోదరుని భక్తిశ్రద్ధలతో కాలనీవాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల పూజలు జరుపుకొని గణేషు నిమజ్జనాని సమయంలో లడ్డూ వేలం పాటలో పోటాపోటీగా జరిగిన సమరంలో లడ్డు ప్రసాదాన్ని బడంగ్ పేట్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి ఐదు లక్షల రూపాయలకు కైవసం చేసుకున్నారు. గణేషు ఉత్సవ కమిటీ సభ్యులు అందరు కలిసి లడ్డును అందజేశారు. అశేష జనవాహిని చేత నవరాత్రులు నిత్య పూజలు హారతులతో విఘ్నేశ్వరుని లడ్డూ ప్రసాదాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు, కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు స్థానికులతో కలిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ దంపతులు  గార్లకి వారి నివాసానికి వెళ్లి బుధవారం నాడు చెరుకు పల్లి వెంకటరెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి  బహుమానంగా సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..... మహిమ కలిగినటువంటి భగవంతుని లడ్డూ ప్రసాదం తీసుకునే భాగ్యాన్ని కలిగించిన దేవదేవునికి, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నాదర్గుల్ గ్రామ ప్రజలతో పాటుగా బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనా వల్ల చిన్నాభిన్నం అయినటువంటి కుటుంబాల జీవనోపాధి మెరుగుపడాలని, కరోనా నుంచి  కార్పొరేషన్ ప్రజలు అందరు సురక్షితంగా ఉండాలని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్  ప్రజా సంగ్రామ యాత్రలో విశిష్ఠ  సేవలు చేస్తూ, అలాగే మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీ మనుగడకు అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నటువంటి శ్రీ రాములు యాదవ్ కి ఆ భగవంతుడు బడుగు బలహీన వర్గాల వారి ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా సేవ చేసే అదృష్టాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, విఘ్నాలు తొలగి, విజయంవైపు కు దూసుకుపోవాలని భగవంతుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, నాయకులు, భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కార్పొరేషన్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.