అర్చక సంక్షేమాభివృద్దికి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అర్చక సమాఖ్య జేఏసీ రాష్ట్ర అధ్యక

Published: Tuesday July 26, 2022
కరీంనగర్ జూలై 25 ప్రజాపాలన :
ష్ట్రంలోని అర్చకుల సంక్షేమాభివృద్ది కోసం తగిన నిధులు మంజూరు చేసేందుకు
రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయం ఉందని అర్చక సమాఖ్య జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ అన్నారు. సోమవారం స్థానిక రాజరాజేశ్వర కళ్యాణ మంటపంలో జరిగిన అర్చక వేల్ఫేర్ బోర్డ్ సభ్యుల అభినందన సభకు ఆయన ముఖ్య తిథిగా హజరయ్యారు.ఈ సందర్బంగా శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో అర్చకుల అన్ని విధాల ఆదుకునేందుకు  సిఎం కేసీఆర్ ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడని,అవి దశల వారిగా అమలవుతాయని శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.
అర్చక సంక్షేమనిధికి సంబందించిన ముసాయిదా సిఎం కార్యాలయంలో సిద్దంగా ఉందన్నారు.అది అమలైతే అర్చక కుటుంబాల జీవితాలు మరింత మెరుగు పడనున్నాయన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అర్చకుల ఉపాధి కోసం 
దూప దీప నైవేద్యం కార్యక్రమం  ప్రవేశ పెట్టి ఎన్నో
అర్చక  కుటుంబాలను ఆదుకున్న ఘనత సిఎం కేసీఆర్ కు దక్కిందన్నారు. రాష్ట్రంలోని యావత్తు అర్చక కుటుంబాల జీవితాల బధ్రత కోసం లక్షా అరవై వేల కోట్ల రూపాయలతో భీమా పథకాన్ని రూపొందించారన్నారు.ఏ అర్చకుడు ప్రమాదవ రణించిన అతని కటుంబానికి పది లక్షల రూపాయలతో ప్రమాద భీమాను ప్రభుత్వం వర్థింప చేయనుందని ఆయన స్పష్టం చేశారు.అంతే కాకుండా అర్చక కుటుంబంలోని ఆడపిల్ల వివహానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు సిఎం కేసీఆర్ హామీ ఇచ్చారని అది త్వరలో అమలు కానుంగన్నారు. అర్చకుల మౌళిక సదుపాయాలు కల్పించేందుకు 
దేవాదాయ శాఖ అధికారులు కూడా హామి ఇచ్చారన్నారు.రానున్న రోజుల్లో అర్చక కుటుంబాల బతుకులు మెరుగయ్యేందుకు ప్రభుత్వం పక్కా కార్యచరణ ప్రణాలిక రూపొందించిందని, త్వరలో దశల‌వారిగా ఆ పథకం అమలు కానుందని శర్మ అర్చకుల కడు హామి ఇచ్చారు. అర్చకులు కూజా దూప దీప నైవేద్య కార్యక్రమాలను తమ‌వంతు బాద్యతో‌నిర్వహించి భక్తుల అధాభిమానాలతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందాలన్నారు.ప్రభుత్వం రూపొందించిన భక్తి కార్యక్రమాలను బాధ్రాతా యుతంగా‌నిర్వహించి మంచి పేరు ప్రతిష్టలు అందుకోవాలన్నారు.రాను రోజుల్లో అర్తకుల దూప దీప‌ నైవేద్యం వేతనాలను పెంచే ‌విదంగా ప్రభుత్వంతో చర్చలు కొనలాహుతున్నాయని,అవి సఫలీ కృతం అయ్యే కమ కృషిని అందిస్తానన్నారు.
అనంతరం అర్చక వేల్ఫేరు బోర్జు ఉమ్మడి జిల్లా నుండి జక్కాపురం నారాయణస్వామి ఎంపిక కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం బోర్డు సభ్యడు నారాయణ స్వామిని అర్చక సంఘం ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రంంలో
 ధూప దీప నైవేద్య రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస సుదర్శన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి నాగరాజు మధుసూదనాచార్య, గౌరవ అధ్యక్షులు ఏటూరి ఆంజనేయ చారి, జిల్లా అధ్యక్షులు నాగరాజు మహేంద్ర చార్య, రాహులా ఆచార్య, గూడెం గుట్ట కొండగట్టు ఆస్థాన ఆచార్యులు గోవర్ధన, సంపత్ కుమార్, కపీంద్ర ఆచార్యులు, జక్కాపురం నారాయణస్వామి జిల్లాల నుండి వచ్చిన అర్చకులు తదితరులు పాల్గొన్నారు.