అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా గ్రామ కమిటీలు

Published: Thursday September 09, 2021
వికారాబాద్ మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు కమాల్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 08 సెప్టెంబర్ ప్రజాపాలన : గ్రామీణ ప్రాంతాలలో అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా గ్రామ కమిటీలను నియమిస్తున్నామని వికారాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కమాల్ రెడ్డి అన్నారు. పురపాలక ఐటి శాఖ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు వికారాబాద్ ఎమ్మెల్యే డా.మెతుకు అనంద్ సూచనతో గ్రామాలలో తెరాస పార్టీ  గ్రామ కమిటీలు, రైతుబంధు కమిటీలు, సోషల్ మీడియా కమిటీలను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొట్టిముక్కుల గ్రామ కమిటీ అద్యక్షునిగా మోత్కూరి ఆంజనేయులు. ద్యాచారం గ్రామ కమిటి అద్యక్షునిగా పట్లోళ్ళ మల్లిఖార్జున్ సర్పన్ పల్లి గ్రామ కమిటీ అధ్యక్షునిగా కొత్తకాపు మాణిక్ రెడ్డి. జైదుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షునిగా చిన్న లక్ష్మని వేంకటేష్. గోధుమగూడ గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఏనుగు సుభాన్ రెడ్డి. రాళ్ళ చిటంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షునిగా B.కిష్టయ్య. పీలారం గ్రామకమిటీ అధ్యక్షునిగా మామిడిపల్లి మల్లారెడ్డి లతో పాటు రైతుబంధు, బిసి, ఎస్సీ‌, ఎస్టీ, మైనారిటీ సెల్, యువజన విభాగం, మహిళా విభాగం, సోషల్ మీడియా విభాగాల అధ్యక్షుల నియామకం చేశామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాం లోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేయడం కొరకే గ్రామ కమిటీ లు వేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు నర్సిములు, షకీరాఖాన్. జనరల్ సెక్రటరీ సత్యయ్య గౌడ్ రైతు బంధు అధ్యక్షులు వెంకటయ్య, సర్పంచుల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు పట్లే వెంకటేశ్వర్లు, ఎల్లన్నోల్ల అంజయ్య, అనిత సత్యయ్య గౌడ్, ముఫ్లయాస్మిన్ గౌస్, కొంపల్లి భారతమ్మ నర్సిములు, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, రాంరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు పాండు, ఎస్ సి సెల్  అధ్యక్షులు రవి, మైనార్టీ సెల్ అధ్యక్షులు  గయాజ్, సోషల్ మీడియా మండల అధ్యక్షులు అనిల్,  నాయకులు సురేష్ కార్యర్తలు  పాల్గోన్నారు.