సజీవ సర్వీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం

Published: Wednesday September 15, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 14, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలో సజీవ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దాన శిబిరం విజయవంతంగా పూర్తీ చేశామని సంస్థ ఛైర్మెన్ ఇరుగు నవీన్ కుమార్ అన్నారు. రక్తం కృత్రిమంగా తయారు చేయలేమని దాతల ద్వారానే సాధ్యమవుతుందని సంస్థ చైర్మన్ అన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరూ మూడు నెలలకో సారి రక్తదానం చేయాలనిదాతలను కోరారు. మనం చేసే రక్త దానం మరో నిండు ప్రాణం నిలబెడుతుందని అన్నారు. రక్తదానం చేసేందుకు మండలంలోని ప్రజా ప్రతినిధులు మండల యువత పెద్ద ఎత్తున రావడం సంతోషకరమైన విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల వైస్ ఎంపిపి గుగులోత్ రమేష్, అంతోటి శివ, కృష్ణ, సంస్థ చైర్మన్ ఇరుగు నవీన్ కుమార్, సభ్యులు, కటకం రత్నాకర్ దాసరి స్వర్ణబాబు, మాడుగుల దినేష్, ఆధురి గోపి, కుక్కల పుల్లయ్య, కొరివి వంశీ నాగరాజ, రాజేష్, సందీప్, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారూ.