రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ద‌ళిత బంధు అమ‌లుచేయాలి భట్టి విక్రమార్క

Published: Monday September 20, 2021
మధిర, సెప్టెంబర్ 19, ప్రజాపాలన ప్రతినిధి : పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపికైన చింత‌కాని మండ‌లంలో అన్ని ద‌ళిత క‌టుంబాల‌కు, అంద‌రికీ పార్టీల‌తో సంబంధం లేకుండా ఇవ్వాల్సిందే. ద‌ళిత‌బంధు ప‌థ‌కంపై అవ‌గాహ‌న లేని కొంద‌రు నాయ‌కులు ద‌ళిత‌బంధు కొద్దిమందికే ఇస్తాం... ఫ‌లానా పార్టీలో చేర‌తాం.. మా పార్టీ కండువాలు క‌ప్పుకుంటేనే ఇస్తాం అనే మాట అంటున్న‌ట్లు నాకు తెలిసింది. ఇది ఏ మాత్రం క‌రెక్ట్ కాదు. ఎవ‌రైనా మ‌ధ్య‌వ‌ర్తులు వ‌చ్చి మీకు ద‌ళిత‌బంధు ఇప్పిస్తాం అని మాట్లాడినా, మా పార్టీలోకి వ‌స్తే ఇస్తాం అని ఎవ‌రైనా చెప్పినా, నాలుగు డ‌బ్బులు ఇస్తే ఇప్పిస్తాం అని చెప్పేద ళారుల మాట‌లు ఎటువంటి ప‌రిస్థితుల్లో న‌మ్మ‌వ‌ద్దు. మా దగ్గ‌ర ప్ర‌తి ఊరు లెక్క ఉంది. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి.. ఎన్ని రేష‌న్ కార్డులు ఉన్నాయి.. కొత్త‌గా ఎంతమంది రేష‌న్ కార్డుకోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌న్న రికార్డు ఉంది. రేష‌న్ కార్డు లేక‌పోయినా.. పెళ్లిళ్లు అయివుంటే వారికి ద‌ళిత‌బంధు వ‌ర్తింప‌జేయాలి. ఇక్క‌డ‌కూడా ద‌ళారులు రేష‌న్ కార్డులు ఇప్పిస్తా.. మా పార్టీలోకి వ‌స్తేనే రేష‌న్ కార్డులు వ‌స్తాయిన అంటేన్న‌ట్లు తెలిసింది. రేష‌న్ కార్డు ఉంటేనే ద‌ళిత‌బంధు వ‌స్తుంద‌ని చెప్పే మాయ‌మాట‌లు ఎవ‌రూ న‌మ్మ‌కండి. అంద‌రికీ ద‌ళిత‌బంధు వ‌స్తుంది.. ద‌ళితతులో పాటు దారిద్య్రరేఖకు దిగువ‌న ఉన్న ఇత‌ర కులాల్లోని వారికి ఇదే విధంగా ప్ర‌భుత్వం ఆదుకోవాలిని డిమాండ్ చేస్తున్నాం.. బ‌డ్జెట్ లో కూడా ద‌ళితబంధుకు సంబంధించిన నిధులు మంజూరు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాం.. ఈ కార్య‌క్ర‌మంలో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు పువ్వాళ్ల దుర్గా ప్ర‌సాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వ‌ర‌రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు గాలి దుర్గారావు త‌దితరులు పాల్గొన్నారు..