బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ వైద్య సేవలు అభినందనీయం సర్పంచ్ సాధినేని చంద్రకళావతి

Published: Tuesday January 10, 2023
బోనకల్, జనవరి 9 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని నారాయణపురం గ్రామంలో బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో గ్రామ పంచాయతీ నందు మేఘ శ్రీ హాస్పిటల్స్ వారిచే నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం సోమవారం విజయవంతమైంది. ఈ క్యాంపులో 120 మంది పేషంట్లకు బిపీ, షుగర్, ఈసిజి, హిమోగ్లోబిన్, సిరమ్
క్రియాటిన్ పరీక్షలు నిర్వహించారు. మేఘశ్రీ హాస్పిటల్స్ ప్రముఖ వైద్యులు టి పవన్ కుమార్ పేషంట్లకు వైద్యసేవలందించి, ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ సాధినేని చంద్రకళావతి మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా మండల కేంద్రంలో అమరజీవి తూము ప్రకాశరావు జ్ఞాపకార్థం బిపీ, షుగర్, కంటి ప్రత్యేక క్యాంపును నిర్వహిస్తున్న బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కొనియాడారు. బత్తినేని అంబులెన్స్, మేఘశ్రీహాస్పిటల్స్ అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడాతూ ప్రాణదాతగా నిలిస్తుందన్నారు. బత్తినేని ట్రస్ట్ వైద్య సేవలు అన్ని గ్రామాలకు విస్తరించాలని కోరారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన మేఘశ్రీ హాస్పిటల్స్ వైద్యసేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వైద్యులు టి పవన్ కుమార్ మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించే సదుద్దేశ్యంతో మేఘశ్రీ హాస్పిటల్స్ హెల్త్ కార్డును రూపొందించామన్నారు. మండలంలోని ప్రతి ఒక్కరూ ఈ కార్డును పొంది సద్వినియోగించుకోవాలని సూచించారు. నేటి జీవనశైలితో ప్రతి ఒక్కరూ అనారోగ్య బారిన పడుతున్నారని ముందస్తు జాగ్రత్తలతో ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. మండలంలోని జర్నలిస్టులందరికీ అతిత్వరలో ఉచితంగా మేఘశ్రీహాస్పిటల్స్ హెల్త్ కార్డును అందజేయనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు సాధినేని మల్లికార్జున్ రావు, క్యాంపు నిర్వాహకులు ఆకెన పవన్, సాధనపల్లి ఆమర్నాధ్, నిఖిల్ సిబ్బంది యంగల గిరి, పండగ గోపి, ఇవాంజిలిన్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.