తల్లాడ, జనవరి 9 (ప్రజాపాలన న్యూస్): ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ, సహకార శాఖ సహాయ మంత్రి బి ఎల

Published: Tuesday January 10, 2023
 తల్లాడ, జనవరి 9 (ప్రజాపాలన న్యూస్):
 
 ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ, సహకార శాఖ సహాయ మంత్రి బి ఎల్ వర్మ తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో రైతులతో ముఖాముఖి చర్చజరుపుతారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని బిజెపి నాయకులు నంబూరు రామలింగేశ్వర రావు, తల్లాడ మండల అధ్యక్షులు ఆపతి వెంకట రామారావు పిలుపునిచ్చారు. సోమవారం తల్లాడ ల వారు మాట్లాడుతూ భవిష్యత్తులో రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ భారతీయ జనతా పార్టీని చూసి బెదిరిపోతున్నాడని అన్నారు.
ఈ కార్యక్రమంల సెక్రటరీ గాద కృష్ణారావు, వాడవల్లి నాగేశ్వరరావు, రాయల రమేష్, ఎల్లంకి భాస్కర్ పాల్గొన్నారు.