ఘనంగా ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు

Published: Thursday October 20, 2022
జన్నారం, అక్టోబర్ 19, ప్రజాపాలన: బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేదల పెన్నీది, ముదిరాజ్ జాతి సమగ్రాభివృద్ధి కొరకు శ్రామించే తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్  68వ  పుట్టినరోజు వేడుకలను మంగళవారం సాయంత్రం  మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మండల ముదిరాజులు  కేక్ కట్ చేసి, ప్రభుత్వ అసుపత్రిలో పండ్లు బ్రేడ్డు పంపిణీ చేశారు. ప్రజా సంక్షేపమామే లక్ష్యముగా   పటుపడుతున్నా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ మరేన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని వారు అకాంక్షించారు.  డాక్టర్ బండ ప్రకాష్  ముదిరాజ్  నిండు నూరేండ్లు సుఖ సంతోషాలతో ఉన్నత పదవులను పొంది ముదిరాజ్ వర్గాల ఆర్ధిక, రాజకీయ, అభివృద్ధి కోసం కోసం కృషి చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దండవేణి శ్రీనివాస్ ముదిరాజ్, సింగసాని సంతోష్ ముదిరాజ్, ముధం రవి ముదిరాజ్, గుర్రపు లక్ష్మణ్ ముదిరాజ్, గుర్రపు రాజకుమార్ ముదిరాజ్, ముదేల్ల శంకర్ ముదిరాజ్, ముదేల్ల శ్రీనివాస్ ముదిరాజ్, అన్నవేని సాయి ముదిరాజ్  తపాల్పూర్ రాకేష్ ముదిరాజ్, చింతగూడ రాజన్న ముదిరాజ్, శిరవేణి సురేష్ ముదిరాజ్, డాగే భీమరాజు ముదిరాజ్, మండల ముదిరాజులు, పాల్గొన్నారు.
 
 
 
Attachments area