ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 1ప్రజాపాలన ప్రతినిధి ***, అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్క

Published: Thursday March 02, 2023
విషయము .. ఇబ్రహీంపట్నంలో  అన్యాక్రాంతమైన  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విజ్ఞాణ కేంద్రం యొక్క స్థలం దాదాపు 400 చ.గజాలు స్వాధీనం చేసుకొని,  విజ్ఞాణ కేంద్రానికి కేటాయించిన స్థలంలో ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నట్టు తెలిసింది. వెంటనే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం నిలిపివేసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విజ్ఞాణ కేంద్రం మాత్రమే నిర్మించాలని కోరుతునాము.  ప్రపంచ మేదావి బాబా సాహేబ్ . డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విజ్ఞాణ కేంద్రనికి అప్పట్లో పది (10) గుంటల భూమి అనగా 1210 చ.గజాలు కేటాయించారు. 1987 నాటి తహసీల్దారు , అయితే నాటి పాలకుల నిర్లక్షనికి నిలువుటద్దముగా నిలిచింది. కనీసం ప్రహరీ గోడ పెట్టి స్థలాన్ని కాపాడ లేదు. స్వీట్ హౌజ్ మల్లేష్ (కౌన్సిలర్) , మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవి+బెస్త అంజయ్య గంగపుత్ర, జనార్ధన్, ముత్యాల శ్రీహరి  ఇతరులు  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం స్థలము ఆక్రమించి నిర్మాణములు చేసారు. మిగిలిన స్థలంలో ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టినారని తెలిసింది. మేయిన్ రోడ్డు పైన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసినట్లయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి.ఒక అతిముఖ్య అతిది (వి.ఐ.పి.) వచ్చినప్పుడు వందలాది వాహనాలతో పాటు సాధారణ ప్రజల వాహనాలు కలిపి తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కావున తక్షణమే విజ్ఞాణ కేంద్ర స్థలంలో జరిగిన ఆక్రమణలు తొలగించడంతో పాటు,  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విజ్ఞాణ కేంద్రానికి కేటాయించిన స్థలంలో, తాజాగా చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు విరమించుకొని,  విజ్ఞాన్  కేంద్రం మాత్రమే నిర్మించాలని మీతో మనవి చేస్తున్నాము. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం  అసెంబ్లీ ఇంచార్జి పల్లాటి రాములు, బిఎస్పి నాయకులు అనుమండ్ల కృష్ణయ్య, గోపగల్ల దాసు, కోశాధికారి కొండు రఘుపతి, సీనియర్ నాయకులు మాదారి కృష్ణ, బంగారుగళ్ల మహేందర్ ఆదిభట్ల మున్సిపల్ అధ్యక్షుడు పాల్గొన్నారు..