గురాకు మాసపత్రిక ను ప్రారంభించిన మంత్రి

Published: Wednesday May 05, 2021
బాలపూర్, మే 4, ప్రజాపాలన ప్రతినిధి : రాజకీయ రంగాలలో రాణిస్తూ, ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న అమ్మ అని పిలిస్తే పలికే మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మహేశ్వరం నియోజకవర్గలో నీ ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ఆని జిల్లా కార్పొరేషన్, మున్సిపాలిటీ కార్యకర్తలు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ లోని టిఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు చిగురాకు మాస పత్రిక ను మంత్రి చేతుల మీదగా తన నివాసంలో ప్రారంభించారు. ప్రతి ఒక్కరు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ డివిజన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలను ఆదుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చే నీధులను సక్రమంగా అందజేయడంలో సబితమ్మకు సాటి లేరు అని కొనియాడారు. అన్ని మతాలకు సమ ప్రాధాన్యమిస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ పేదలకు అండగా నిలుస్తున్న, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం నుంచి ప్రజలకు నేరుగా నిధులు చేరుతుందని పలువురు నాయకులు పేర్కొన్నారు. సబితమ్మ ప్రజల గురించి 24 గంటలు ఆలోచించే విధానంలో చిగురాకు మాస పత్రికలో క్లుప్తంగా వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులకు నిదర్శనంగా నిలుస్తుందని ఈ మాస పత్రిక నీ చెప్పారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, సిద్ధల చిన్న బీరప్ప, ధనలక్ష్మి రాజు, కార్పొరేషన్ టీఆర్ఎస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.