నన్ను పెంచితే నిన్ను పెంచుతా

Published: Thursday July 01, 2021
చెట్లు మొక్కలుఆవేదనతో అంటున్నా మాటలు.

మధిర ప్రతినిధి ప్రజాపాలన : వినరా, వినరా. నరుడా తెలుసుకోర మానవుడా. అన్నట్లు చెట్లు కూడా ప్రాణంతో ఉండి మాట్లాడినట్టే అని వృక్ష శాస్త్ర నిపుణుడు జగదీష్ చంద్ర బోసు చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో సామాన్య శాస్త్రంలో ఉన్నమాట నిజం మరి. అలాంటి చెట్లు  మానవ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నాయి. మొక్కలు ఆవేదనతో అంటున్న తీరు ఈ విధంగా ఉంటుందిఒరే మానవా నిత్యం నీవు పీల్చేగాలి, స్వచ్ఛమైన గాలి... ఇది మా వృక్ష జాతి నుండి వస్తుంది. నీవు వదిలే వ్యర్ధ పదార్దాలు, చెడుగాలి మరల నీకు హాని జరగకుండా మేము పీల్చుకుంటాం. మా వృక్ష జాతి లేనిదే నీవు బ్రతకలేవు. తిండి, గూడు, బట్ట అన్ని మా ద్వారానే అంతదాక ఎందుకు మొన్న కరోనా సెకండ్ వేవ్ రోగంలో మా గాలి, మా మొక్కల ప్రాముఖ్యత ఏమిటో నీకు తెలిసేఉంటుంది. ఎంతో మంది ప్రాణాలు కాపాడాం. మా ఆక్సిజన్ విలువ ఎంతో  మీకు తెలుసు. కొంత మంది విచిత్రమైన మనుషులు ఇప్పటికి మొక్కలు పెంచుదాం అనే ఆలోచన లేక ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేసి గదిలో దాచుకుంటున్నారు. ఒకటి గుర్తించుకో మొక్కగా పెద్దచెట్టుగా నన్ను గొడ్డలితో నరికినా నిప్పుతో కాల్చిన నేను నిన్ను హాయిగా చూసుకుంటన్న....ఆఖరికి నీవు చనిపోయినా నేనిచ్చే కట్టెలు మీదే నీ బ్రతుకు ముగుస్తున్నది. ఇక నైనా తెలుసుకోండి ఎక్కడ పడితే అక్కడ మా మొక్కలు నాటండి. నీరు పోసి, ఎరువు వేసి  జంతువులు మేయ కుండా మమ్మును పెంచండి. చావు బ్రతుకుల మధ్య వెంటి లెటర్ మీద కొట్టి మిట్టాడకుండా మిమ్మల్ని హాయిగా పెంచుతాం.... మేము సైతం మిత్ర మండలి పర్యావరణ ప్రేమికులు లంకా కొండయ్య (సామాజిక సేవకులు, గ్రీన్ ఇండియా చాలంజ్ నిర్వాహకులు) ప్రముఖ వైద్య నిపుణులు dr అనిల్ కుమార్ కనకపూడి, మధిర మండల విద్యాశాఖాధికారి Y.ప్రభాకర్, ప్రముఖ హోమియోపతి సేవకులు, ఉపాధ్యాయులు మేడేపల్లి శ్రీనివాసరావు గ్రీన్ ఇండియా చాలంజ్ వాలంటీర్లు లంకా కరుణ లీయోనా, మేడేపల్లి ప్రణిత, మేడేపల్లి సాయిరోహన్,షేర్ ngo వాలంటీర్ md సిరాజుద్దిన్, Blood డోనర్ కొనా జగదీష్, రామ భక్త సీతియ్య కళా పరిషత్ నిర్వాహకులు బాబ్లా. పర్యావరణ కవి పుల్లఖండం చంద్రశేఖర్, విశ్రాంత ఎంపీడీఓ మాధవరపు నాగేశ్వరావు, పుతుంబాక శ్రీ కృష్ణ ప్రసాద్. వృక్షో రక్షిత రక్షితః