అడిషనల్ కలెక్టర్ కు వినతి

Published: Wednesday June 23, 2021
బాలపూర్, జూన్ 22, ప్రజాపాలన ప్రతినిధి : కబ్జాలకు గురవుతున్న కల్వర్టును, ప్రభుత్వ భూములను కాపాడండిని అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్  కు వినతి. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో 3వ డివిజన్ కార్పొరేటర్ రామిడి మాధురి వీర కర్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ జీ ఆర్ నుండి ఆర్ ఎం ఆర్ కాలనీలో ఉన్న కల్వర్ట్ ను కబ్జాలకు గురికాకుండా కాపాడవలసిందిగా రాష్ట్ర యువ మోర్చ్ కార్యవర్గ సభ్యులు రామిడి శూర కర్ణ రెడ్డి, బీజేవైఎం జనరల్ సెక్రెటరీ రవితేజ తో కలిసి స్థానిక కార్పొరేటర్ మాధురి వీర కర్ణ రెడ్డి రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ వెల్లడించిన వివరాలు బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడ  3వ డివిజన్ లోని ప్రధాన రహదారి లో ఎన్ జె ఆర్  & ఆర్ ఎం ఆర్ కాలనీలో ఉన్న కల్వర్టును మూసివేసి ఈ స్థలమును డంపింగ్ యార్డ్ గా మార్చడం జరిగిందిని చెప్పారు. పైన ఉన్న మూడు చెరువులు కోమటికుంట చెరువు, పోచమ్మ కుంట చెరువు, ఎర్ర కుంట చెరువుల నుండి వచ్చే నీరు ఈ కల్వర్టు ద్వారానే మీర్ పేట్ పెద్ద చెరువులలోకి వెళ్తాను అన్నారు. కబ్జా చేసిన ఈ కల్వర్టును ఓపెన్ చేసి నీరు  చెరువులోకి పోయే విధంగా చర్యలు తీసుకోవాలని, కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కి తెలిపారు. అదేవిధంగా అల్మాస్గూడ గ్రామంలోని సర్వే నెంబర్లు 32, 33, 43 ఈ నెంబర్లలో గల 13 గుంటల ప్రభుత్వ భూమి కబ్జాకు గురి అవుతున్నదిని అన్నారు. ప్రస్తుతం ఈ స్థలం మార్కెట్ విలువ 4 కోట్ల రూపాయలు. మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రభుత్వానికి పెద్ద నష్టం కలిగిస్తూన్న  కబ్జాదారులను పాల్పడుతున్న వ్యక్తులపై వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రభుత్వ భూమిని కాపాడి చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కులుగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటు చేయగలరని బాలాపూర్ మండల తాహాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేయడం జరిగిందిని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యులు రామిడి శూర కర్ణ రెడ్డి గారు, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేవైఎం జనరల్ సెక్రటరీ అడికే రవి తేజ పాల్గొన్నారు.