డ్రైనేజీల సమస్యలపై కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన తంగడపల్లి వాసులు

Published: Friday December 09, 2022

చౌటుప్పల్ డిసెంబర్ 8 (ప్రజాపాలన ప్రతినిధి): చౌటుప్పల్ మున్సిపాలిటి తంగడపల్లి పరిధిలోని ఐదవ వార్డులో అస్తవ్యస్తంగా నిర్మించిన డ్రైనేజీలవలన మురుగునీరు నిల్వతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నామని తక్షణమే డ్రైనేజీని మరమ్మత్తు చేయించాలని మున్సిపల్ కమిషనర్ కె. నరసింహరెడ్డికి తంగడపల్లి పరిధిలోని పెద్దమ్మకాలనీ వాసులు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతకుముందు కాలనీవాసులకు ఇంకుడు గుంతలు ఉండేవని, మొన్న జరిగిన శాసనసభ ఉపఎన్నికలలో హడావిడిగా తొందర తొందరగా పైపుల ద్వారా డ్రైనేజీలు నిర్మించారని తెలిపారు.డ్రైనేజీ నిర్మాణం సమయంలో లేవలింగ్ సరిగా చేయకపోవడం వలన మురుగునీరు బయటకి పోవడం లేదని, పైపులలో మరియు చంబర్లలో నీరు నిండి దుర్వాసన వస్తుందని అన్నారు. చంబర్స్ చుట్టు దోమలు వ్యాపించి ఉండడంవల్ల వాటి ద్వారా డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలు చర్మ సంబంధిత వ్యాదులు వచ్చే ప్రమాదం ఉన్నందున ఇట్టి పైపు లైన్లను పునరుద్ధరీకరణ చేయవలసిందిగా కోరుకుంటున్నామని తెలియజేశారు. నూతనంగా డ్రైనేజీలు నిర్మించే విధంగా కాంట్రాక్టర్ కి ఆదేశాలు ఇవ్వాలని పెద్దమ్మ కాలనీవాసులు కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు ఇన్చార్జ్ కొయ్యడ శేఖర్, అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండి అస్లాం, నాయకులు రామచంద్రం, చింతల గణేష్ తదితరులు పాల్గొన్నారు.