ఏబీవీపీ నూతన కోరుట్ల పట్టణ కార్యదర్శిగా మాడవేణి సునీల్

Published: Saturday October 29, 2022

కోరుట్ల, అక్టోబర్ 28 ( ప్రజాపాలన ప్రతినిధి ):

కోరుట్ల పట్టణాల్లో అఖిల భారతీయ విద్యార్ధి కోరుట్ల నగర కమిటీ శుక్రవారం రోజున ఎన్నుకున్నారు .ముఖ్య అతిథిగా విభాగ్ సంఘటన మంత్రి రాజు సాగర్ పాల్గొన్నారు. ఈ రాజు సాగర్ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి పరిషత్ 1949 స్థాపించిన నుండి అనేక విద్యారంగ సమస్యల పైన ఉద్యమాలు చేసిందని విద్యార్థి పరిషత్ విద్యారంగ సమస్యలు కాకుండా సామాజిక సమస్యల పైన ఉద్యమాలు చేస్తుందని జ్ఞానం శీలం ఏకత తో విద్యార్తిలందరిని జాతీయత భావం దేశభక్తి వైపు నడిపిస్తున్న ఏకైక విద్యార్ధి సంస్థ ఏబీవీపీ తెలియజేశారు. నూతన కార్యవర్గం నగర కార్యదర్శి మాడవేణి సునీల్ , నగర ఉపాధ్యక్షులుగా ప్రణయ్, ఆదిత్య, శివకుమార్,నగర సంయుక్త కార్యదర్శులుగా సాయి చందు, శ్రవణ్, మానస, గర్ల్స్ కన్వీనర్ భావన,కో కన్వినర్ రుచిష్య,స్టూడెంట్ ఫర్ డేవోలెప్మెంర్ కన్వీనర్:- మహాదేవ్ ,స్టూడెంట్ ఫర్ సేవ ఇంచార్జి సంజీవ్,స్పోర్ట్స్ ఇంచార్జి అజయ్,సభ్యులుగా అజయ్, భారత్, మణిదీప్, సౌమిత్, నిఖిల్, మహేందర్, అక్షయ్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు.