*విద్యార్థుల బలవన్మరణాలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి*

Published: Friday March 03, 2023
మంచిర్యాల టౌన్, మార్చి 02,ప్రజాపాలన:విద్యార్థుల బలవన్మరణాలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి,విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని కార్పొరేట్ విద్యాసంస్థల దిష్టిబొమ్మను గురువారం
రోజున బెల్లంపల్లి కొత్త బస్టాండ్ చౌరస్తాలో   అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో దహనం  చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చైతన్య, నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతూ పిట్టల్లా రాలిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నది తప్ప విద్యార్థుల బలవన్మరణాలకు కారకులైన కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోవడంలో విఫలమైందని, తెలంగాణ రాష్ట్రం వస్తే కార్పొరేట్ విద్యాసంస్థలను పూర్తిగా రద్దుచేసి కార్పొరేట్ తరహాలో పేద,మధ్యతరగతి ఎస్ సి, ఎస్ టి,బి సి,మైనార్టీ విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తూ వత్తాసు పలుకుతుందని,కార్పోరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల,
పి.అర్.ఓ లు మోసపూరిత మాయ మాటలు నమ్మి అమాయకులైన తల్లితండ్రులు తమ పిల్లలు మంచి మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అప్పు సప్పుచేసి లక్షల రూపాయలు ఫీజుల రూపంలో చెల్లిస్తున్నారని,బ్యాచ్ ల పేరుతో విద్యార్థులను విడదీస్తూ ధనవంతునికి ,పేదోనికి వేరు వేరు రకాల విద్యను అందిస్తున్నారని,ర్యాంకుల పేరుతో మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, సీనియర్ల వేధింపులు, అవమానాలు,టీచర్ల, వార్డెన్ల సూటిపోటి మాటలు విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నాయని,గత 20 రోజుల్లో నలుగురి ఆత్మహత్యలు ప్రస్తుత విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి కారణాలు అయ్యాయని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలకు కారకులు ఎవరైనా ప్రాణాలు కోల్పోయేది విద్యార్థులేనని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని,విద్యార్థుల మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని,కార్పొరేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో పసులేటి వెంకటేష్,ఆకాష్, ప్రదీప్,రవి,శేఖర్,నరేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.