ఉత్తమ మహిళా ఆరోగ్య కార్యకర్త సత్యవాణికి ఘన సన్మానం

Published: Friday March 18, 2022
మధిర మార్చి 17 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలంలో పరిధిలో గురువారం నాడుకరోనా కష్టకాలంలో ప్రజలందరికి ధైర్యం చెప్తూ విసుగు విరామం లేకుండా 100% లక్ష్యాన్ని పూర్తి చేస్తూ ఉత్తమ కోవిడ్ వారియర్ గా జిల్లా కలెక్టర్ చే ప్రశంసాపత్రాన్ని అందుకున్న మాటూర్ పిహెచ్సి ఎఎన్ఎమ్ శ్రీమతి పి సత్యవాణి ని మాటూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ కరోనా సమయంలో పోలీసులు ఆరోగ్య కార్యకర్తలుచేసిన సేవలు అనిర్వచనీయం అని, ముఖ్యంగా కోవిడ్ వాక్సిన్ వచ్చాక ఆరోగ్య కార్యకర్తల పనిభారం రెట్టింపు అయినప్పటికీ నిరంతరం ఉత్సాహంతో 100% వాక్సినేషన్ కొరకు సత్యవాణి బృందం చేసిన సేవలు గొప్పవిగా పేర్కొన్నారు. వృత్తి నిబద్దత కలిగిన వారిలో సత్యవాణి ఒకరని, వారికి ఉత్తమ కోవిడ్ వారియర్ అవార్డు రావడం ఆరోగ్య కార్యకర్తలందరికి గర్వకారణంగా పేర్కొంటూ, సత్యవాణి ఇదే విధంగా సేవలు అందిస్తూ మున్ముందు మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాటూరు పి.హెచ్.సి ఆరోగ్య కార్యకర్తలు ఎంవి లక్ష్మి, కె సృజన కుమారి లతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.