పోడు భూములకు శాశ్వత పరిష్కారం ** సిపిఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న ** జీవో జారీ చేయడం పోరాట

Published: Saturday September 17, 2022

ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 16 (ప్రజాపాలన, ప్రతినిధి) : ప్రజా సంఘాల పోరాట ఫలితంగా పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రభుత్వం చెప్పడం, జీవో 140 జారీ చేయడం, హర్షించదగ్గ విషయమని సిపిఎం జిల్లా కార్యదర్శి కుశన రాజన్న అన్నారు. శుక్రవారం విలేకర్ల సమావేశంలో కుశన రాజన్న మాట్లాడుతూ పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని, పోడు రైతులు సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రజా ప్రతినిధులను ఇన్వాల్వ్ చేస్తూ కమిటీలు చేసినప్పటికీ రాజకీయాలకు అతీతంగా పోడు సాగులందరికీ 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్, రాజేందర్, గోడిసెల కార్తీక్, తదితరులు పాల్గొన్నారు