గాంధీ కుటుంబం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు డీసీసీ అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే రా

Published: Saturday July 23, 2022
వికారాబాద్ బ్యూరో 22 జూలై ప్రజాపాలన : గాంధీ కుటుంబం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని డిసిసి అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ ముందు భాగంలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై అక్రమంగా ఈడి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నందుకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ పత్రికలో అవకతవకలు జరిగాయని సోనియా గాంధీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈడి సంస్థను ఉసిగొల్పడం సమంజసం కాదని ఘాటుగా స్పందించారు. ఈడి సంస్థను బిజెపి తన కాలికింద చెప్పు లాగా వాడుకుంటుందని విమర్శించారు. సోనియా గాంధీని ఈడి కార్యాలయం  ముందు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం జరిగిందని ధ్వజమెత్తారు. నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. మచ్చ లేని నాయకురాలు త్యాగశిలి సోనియా గాంధీపై అక్రమ కేసులు వేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి సిగ్గు వచ్చే విధంగా గాంధీ కుటుంబ త్యాగాలను ప్రజలకు గుర్తు చేయడమే లక్ష్యం అన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణాలను త్యాగం చేసిందని వివరించారు. బీజేపీ ప్రభుత్వానికి బుద్ది వచ్చేలా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కేంద్రం లోని పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్బంగా పోస్ట్ ఆఫీస్ ముందు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను జిల్లా కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కిసాన్ సెల్ అధ్యక్షుడు రత్నా రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు నర్సిములు, అనంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పరశురామ్ రెడ్డి, కృష్ణ,  సురేందర్, నస్కల్ అశోక్ ముదిరాజ్, వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి, నాయకులు భాస్కర్, సతీష్ రెడ్డి, చాపల శ్రీనివాస్ ముదిరాజ్, జొన్నల రవిశంకర్, ఎర్రవల్లి జాఫర్,  కమాల్ రెడ్డి, కౌన్సిలర్ లు మురళి, వేణుగోపాల్ రెడ్డి, రెడ్యానాయక్, మల్లికార్జున గౌడ్, ఉస్మాన్,  వెంకట్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ద్యాచారం రజినీకాంత్, బుచ్చయ్య, జంగయ్య, హన్మంత్,  రత్నం, కిష్టా రెడ్డి,  రంగరాజ్, బాదం అశోక్, దుద్యాల లక్ష్మణ్ ముదిరాజ్, అర్జున్, బందయ్య, రహీం, కరీం, జానీ, రవీందర్, వినోద్ కుమార్, విజయ్ కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area