తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ కులాల 'ఉప వర్గీకరణ' కు వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా

Published: Wednesday December 08, 2021
హైదరాబాద్ 06 డిసెంబర్ ప్రజాపాలన ప్రతినిధి: ఎస్సీ కులాలను ఉప వర్గీకరించవద్దని 'జాతీయ మాల మహానాడు' ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా మరియు నిరసనలు ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్బంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య గారు మాట్లాడుతూ, సుప్రీమ్ కోర్టు తీర్పును మరియు జాతీయ ఎస్సీ కమిషన్ నివేదికలను గౌరవించి ప్రభుత్వాలు ఎస్సీల ఉప వర్గీకరణను మానుకోవాలని, బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటన చేస్తూ.... దేశంలో మెజారిటీ రాష్ట్రాలు ఉప వర్గీకరణను ఒప్పుకోవడం లేదని, అందుకు ఇది సాధ్యం కాదని తెలుపగా మరొక వైపు కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, నారాయణ స్వామి సామజిక సాధికారత మంత్రి ఎల్ మురుగన్ పశు సంవర్ధక సహాయ మంత్రులు వర్గీకరణ చేస్తామని, మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారని ఇది వారి ద్వంద నీతికి నిదర్శనమని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెన్నయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చెన్నయ్యతో పాటు మాల మహానాడు తెలంగాణ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు నన్నేటి పుష్ప రాజ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పున్నమ్మ, తెలంగాణ అధికార ప్రతినిధి ఎడ్ల కృష్ణయ్య, తెలంగాణ ఉపాధ్యక్షులు బ్యాగరి చెన్నయ్య, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు కావలి రమేష్, ఉపాధ్యక్షులు చెన్నయ్య, రంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు చిక్కుడు గుండాలు, వరంగల్ రూరల్ అధ్యక్షులు నర్సింగ రావు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు జాకబ్ ప్రతాప్, జెట్ ప్రోలు కొల్లాపూర్ అధ్యక్షులు, సూర్యాపేట మహిళా అధ్యక్షురాలు పిట్టల భాగ్యమ్మ, నాగార్జున సాగర్ నియోజకవర్గ అధ్యక్షురాలు పెయ్యల గీత, సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ, నేరేడుచర్ల మండల అధ్యక్షురాలు శోభ, నాయకులు యాకుబ్, నర్సింగ రావు, కడగండ్ల యాదగిరి, రాష్ట్ర కోశాధికారి కావలి హన్మంతు, ముసలయ్య, భాస్కర్ పాల్వంచ, రాజ్ కుమార్ తదితరులు మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి వందలాది మంది మాల మహానాడు కార్యకర్తలు పాల్గొన్నారు.