ప్రవాసీ తెలంగాణ దివాస్ ను నిర్వహించాలి

Published: Monday December 20, 2021
జన్నారం రూరల్, డిసెంబర్ 19, ప్రజపాలన : తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల మనోభావాలను గౌరవించి ప్రవాసీ తెలంగాణ దివాస్ ను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరగొండ తిరుపతి గౌడ్ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. 1990 డిసెంబర్ జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో వలస కార్మికుల వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ పై తీర్మానాన్ని చేసిందని, కోవిడ్ సమయంలో వివిధ దేశాల నుంచి 7 లక్షల పైగా కార్మికులు స్వదేశాలకు వచ్చారని అన్నారు., ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్న వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సహకారాలు అందించలేదని ఆరోపించారు. కరోనా సమయంలో హడావిడిగా వెళ్లగొట్టిన కార్మికులకు జీత బకాయిలు ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ ఇవ్వలేదని ఆరోపించారు. వాటిని రాబట్టుకోవడం కోసం జస్టిస్ పర్ వెజ్ తెప్ట్ అనే ఉద్యమం నడుస్తోందని పేర్కొన్నారు . వాపాస్ వచ్చిన కార్మికులకు పునరావాస్ భాద్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవాలని డిమాండ్ చేశారు, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హమి ప్రకారం సమగ్ర ఎన్నారై పాలసీ ప్రవేశపెట్టి కార్మికులకు సంక్షేమం కోసం గల్ఫ్ భందు కార్యక్రమం తీసుకురావాలని డిమాండ్ చేశారు.