మత, విద్వేష రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదుఎనిమిది ఏండ్ల తెలంగాణ పాలన దేశానికే ఆదర్శం

Published: Saturday September 17, 2022

మధిర  సెప్టెంబర్ 16 ప్రజా పాలన ప్రతినిధి హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమై  17 సెప్టెంబర్ 20 22 నాటికి 75వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శుక్రవారం  మధిర నియోజకవర్గ కేంద్రం, మధిర పట్టణంలో తెలంగాణ ప్రజల పోరాట పటిమ, సంస్కృతి, సంప్రదాయాలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఘనంగా చాటేలా నిర్వహించారు. సమైక్యతా ర్యాలీలో టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొన్నారు. అలానే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, విద్యార్థులు, యువత, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పట్టణంలోని వైస్సార్ సర్కిల్ దగ్గర ప్రారంభం అయిన ర్యాలీ మధిర వ్యవసాయ మార్కెట్ యార్డు వరుకు సాగింది. ర్యాలీలో అందరూ జాతీయ జెండాలు చేత పట్టుకొని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో జరిగిన సభలో ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ మత, విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. తెలంగాణలో అది సాధ్యం కాదని బిజెపి ప్రభుత్వాన్ని పరోక్షంగా హెచ్చరించారు. ఆహింస, శాంతియుత పద్దతిలో పోరాడి ఉద్యమ నేతగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించారని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ 8 ఏండ్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు పెద్ద పీట వేశారని వారికి అవసరమైన అన్ని అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. అందరూ కేసీఆర్ కి అండగా నిలవాలని కోరారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుని జాతి నిర్మాతల త్యాగాలను గుర్తు చేసుకుందామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు బొమ్మెర రామూర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మొండి తోక లత ఎంపిపి మెండెం లలిత ఆర్డీవో రవీంద్రనాథ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.