ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది సిపిఎం

Published: Thursday May 20, 2021
మధిర, మే 19, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంరాయపట్నం గ్రామంలో దాన్యం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మంద సైదులు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మార్నిడి పుల్లయ్య గ్రామంలో ధాన్యం రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నామమాత్రపు కొనుగోలు చేయడం వల్ల గ్రామంలోని చాలా మంది రైతులు తమ పంటను తక్కువ ధరలకే ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారని ప్రభుత్వం కొనుగోలు కోసం ఎదురు చూసి అధికార పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోయామని రైతులు తెలియజేశారని అన్నారు. ఇంకా కొంతమంది ధాన్యం రైతులు ప్రభుత్వం కొంటుందేమోనని ఆశగా ఇండ్ల వద్ద కల్లాల వద్ద ధాన్యాన్ని ఆరబె ట రు వర్షానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మధిర మండలం లోని పలు గ్రామాల్లో ధాన్యం రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టితో మండలానికి సరిపడా లారీలు గన్ని బ్యాగులు అందించాలని కాటా వేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు