సకాలంలో త్రాగు నీరు అందించాలి

Published: Wednesday April 20, 2022
మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 19, ప్రజాపాలన : సకాలంలో త్రాగు నీరు అందించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మంగళవారం రోజు మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది.. ఈ సందర్భంగా మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు వేములపల్లి సంజీవ్, షేక్ మజీద్ లు మాట్లాడుతూ ఏ వన్ గ్రేడ్ కలిగి జిల్లా కేంద్రమైన మంచిర్యాల మున్సిపాలిటీ లో ప్రతిరోజు నల్ల నీళ్లు ఇవ్వ లేని దుస్థితిలో ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుత ఎండాకాలం నీటి ఎద్దడి ఏర్పడకూడదని మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు, ఇటీవల మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి సుమారు 44 లక్షల రూపాయలతో 8 ట్రాక్టర్లను ట్యాంకర్లను కొనుగోలు చేయడం జరిగిందని, వాటి ద్వారా మంచిర్యాల పట్టణ ప్రజలకు మంచినీరు సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు, ట్యాంకర్ల పై పురపాలక సంఘం మంచిర్యాల అని పేరు పెట్టి కేవలం ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ ఫోటోలు గల ఫ్లెక్సీ పెట్టుకొని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని, సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టుంది అధికార పార్టీ నాయకుల తీరును విమర్శించారు, వాటర్ ట్యాంకర్ లపై అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు మున్సిపల్ కౌన్సిలర్ అందరి ఫోటోలు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ఫోటోలు గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని లేదా  వెంటనే వారు ప్రస్తుతం పెట్టిన ఫ్లెక్సీలు తీసి వేయాలని డిమాండ్ చేశారు. చాతనైతే మిషన్ భగీరథ పనులు త్వరగా పూర్తి చేసి ప్రతి ఇంటికి ప్రతి రోజు నల్ల నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సల్ల మహేష్, రామగిరి బానేష్, సునీత ప్రభాకర్, కొండ పద్మ చంద్రశేఖర్, జోగుల శ్రీలత సదానందం తదితరులు పాల్గొన్నారు.