ఘనంగా మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

Published: Thursday October 29, 2020

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  జన్మదిన వేడుకలను తెరాస నేతలు మధిరలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో కేక్ కట్ చేసి.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి  శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, యన్నం కోటేశ్వరరావు, మొండి తోక సుధాకర్, దిశా కమిటీ మెంబర్ కోటా రాంబాబు, నాగార్జున,బండి వెంటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.