బోనకల్ ,జులై 3 ప్రజాపాలన ప్రతినిధి: సిపిఎం సీనియర్ నాయకుడు, రైతు సంఘం నాయకుడు కిలారి తిరుపతయ్య

Published: Monday July 04, 2022

బోనకల్ ,జులై 3 ప్రజాపాలన ప్రతినిధి: సిపిఎం సీనియర్ నాయకుడు, రైతు సంఘం నాయకుడు కిలారి తిరుపతయ్య తన జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజా సమస్యల, రైతు సమస్యల కోసం క్రమశిక్షణతో పనిచేసిన మహానీయుడు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన కిలారు తిరుపతయ్య శనివారం అనారోగ్యంతో మృతి చెందినారు.  మృతదేహాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, నవ తెలంగాణ జనరల్ మేనేజర్ మన్నేపల్లి సుబ్బారావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్న వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, ఎర్ర శ్రీకాంత్, చింతలచెరువు కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు బండి పద్మ, మాదినేని రమేష్, షేక్ జబ్బర్, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఉపాధ్యక్షుడు ఉమ్మనేని కోటయ్య ,సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు తాతా భాస్కరరావు, బి వి కే ట్రస్ట్ సభ్యులు ఎనిగండ్ల శ్రీనివాసరావు, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు సందర్శించి నివాళులర్పించారు. మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్, బంధం నాగేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, గోవిందాపురం ఎల్ గ్రామ సర్పంచ్ ఉమ్మనేని బాబు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడు ఇరుగు జానేసు, వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు షేక్ మౌలాలి టిడిపి జిల్లా నాయకులు మల్లంకొండ వెంకటరామయ్య, టిడిపి మండల అధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు భాగం రమేష్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ప్రముఖ వ్యాపారులు చెన్నా సుధీర్, బచ్చు వెంకటేశ్వర్లు, తుమ్మలపూడి శ్రీనివాసరావు, రంగా నాగేశ్వరరావు మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జున రావు ,రైతు బంధు మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్ రావు, చింతకాని ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, టిఆర్ఎస్ చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, టిఆర్ఎస్ జిల్లా నాయకులు కోటా రాంబాబు, ఉమ్మనేని కృష్ణ వెనిగండ్ల మురళి మధిరకు చెందిన శ్రీరామనేని నాగేశ్వరరావు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, మండల కార్యదర్శి యంగల ఆనందరావు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. సిపిఎం సీనియర్ నాయకులు మాదినేని నారాయణ ,ప్రముఖ వైద్యులు మల్లెల వెంకటేశ్వరరావు లక్ష్మీపురం సొసైటీ అధ్యక్షులు మాదినేని వీరభద్రరావు పారుపల్లి పూర్ణచంద్రరావు, పారా లక్ష్మీనారాయణ చింతకాని సిపిఎం నాయకులు తోటకూర వెంకట నరసయ్య, వత్సవాయి జానకి రాములు లక్ష్మీపురం ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత, మాజీ ఎంపీపీలు చిట్టిమోదు నాగేశ్వరరావు, తుళ్లూరు రమేష్ సిపిఎం మధిర పట్టణ మాజీ కార్యదర్శి పాపినేని రామ నర్సయ్య, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు పంతు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు మాలింపాటి వీరభద్రం, సిపిఎం మండల కమిటీ సభ్యులు బంధం శ్రీనివాసరావు, కిలారి సురేష్, మందడపు శ్రీనివాసరావు, కందికొండ శ్రీనివాసరావు, దొప్ప కొరివి వీరభద్రం, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు వాసిరెడ్డి వరప్రసాదరావు ,సిపిఎం మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాలకు చెందిన సిపిఎం నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్, కాంగ్రెస్, టిడిపి, సిపిఐ నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పెద్దబీరవల్లి,  మోటమర్రి సర్పంచులు ఆళ్ల పుల్లమ్మ, కేతినేని ఇందు లక్ష్మీపురం మాజీ సర్పంచ్ కొమ్ము కమలమ్మ మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సత్తుపల్లి ఏసీపి ఎన్. వెంకటేష్ ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం దొండపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సంతాప సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కొంతమంది జీవించి చనిపోగానే ప్రజల వెంటనే మర్చిపోతారని మరికొందరు మృతి చెందినా జీవితాంతం ప్రజా హృదయాలలో నిలిచిపోతారని అటువంటి వ్యక్తి కిలారు తిరపతయ్య అని కొనియాడారు. తన జీవితాంతం ప్రజల కోసమే పని చేశాడు అన్నారు. తిరపయ్య లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని సిపిఎం శ్రేణులు ప్రజా పోరాటాలు నిర్వహించాలని సూచించారు. సిపిఎం పార్టీలో ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఉంటాయని వాటిని తట్టుకొని తన జీవితాంతం సిపిఎం పార్టీలోనే ఉండి ప్రాణాలు వదిలారు అన్నారు. కమ్యూనిస్టు పార్టీ అంటేనే కష్టాల పార్టీ అని ఆ పార్టీలో కడవరకు నిలబడటం అంటే కమ్యూనిస్టులో రాటు తేలటం అన్నారు. తిరపయ్య మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సంతాప సానుభూతి తెలిపారు. పోతినేని సుదర్శన్ రావు, పొన్నం వెంకటేశ్వరరావు, లింగాల కమల్ రాజు, ఉమ్మనేని కోటయ్య, కంకణాల సౌభాగ్యం సంతాప సభలో మాట్లాడారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను వారు పరామర్శించి ఓదార్చారు. తిరుపతయ్య మృతదేహాన్ని చూసేందుకు లక్ష్మీపురం గ్రామం తో పాటు మండలంలోని వివిధ గ్రామాల  ప్రజలు కన్నీరు మున్నీరు అయ్యారు.