హిందీ భాషతోనే జాతీయ సమైక్యత, దేశభక్తి సాధ్యం ఆర్.యు.పి.పి.టి. జగిత్యాల జిల్లా శాఖ ప్రధాన కార్య

Published: Thursday September 15, 2022

రాయికల్, సెప్టెంబర్ 14 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలంలోని రామాజీపేట్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు పక్షాన జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పులస్వామి యాదవ్ ఘనంగా జాతీయ భాషా హిందీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హిందీ భాషపై విద్యార్థులకు  వ్యాసరచన పోటీలు నిర్వహించారు.  పోటీలలో విజేతలై బహుమతులు పొందిన విద్యార్థులు ఎల్లిపాక స్పందన, కొత్తకొండ నిహారిక, గుర్రం శివాని, న్యావనంది రజని లకు ఎస్.ఎం.సి. చైర్మన్లు వాసరిరవియాదవ్, కటుకంరమేష్ లు భగవద్గీత లను ప్రధానం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందీ దేశానికి హృదయం లాంటిదని, దేశానికి స్వాతంత్య్రం తీసుకవచ్చిన భాష హిందీ కావడంతోనే అధికార, జాతీయ భాషగా హిందీ ని భారత ప్రభుత్వం గుర్తించినదని, దేశభక్తి, జాతీయ సమైక్యత హిందీ తోనే సాధ్యమవుతుందని అన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో హిందీ తో అవసరాలు,  ఉపాధి అవకాశాలు దినదినం పెరుగుతున్నాయని, అందుకే ప్రముఖ హిందీ కవి భారతేంద్ హరిశ్చంద్ర్ "హిందీ హిందూ హిందుస్థాన్" అని వాక్యనించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తెనుగురమేష్, చిలువేరి విజయ్ కుమార్, వల్వోజు శ్రీనివాసచారీ, చిటేటిప్రతాప్ రెడ్డి, బూసి రమ, అంజుంబేగం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 
 
 
Attachments area
 
 
 
 
Reply
Forward